Heroines : తల్లిదండ్రులపైనే కేసులు పెట్టిన హీరోయిన్లు ఎవరో తెలుసా..?

Heroines : సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఎలాంటి న్యూస్ అయినా సరే ఇట్టే వైరల్ అవుతుంది. .

By: jyothi

Updated On - Sat - 27 May 23

Heroines : తల్లిదండ్రులపైనే కేసులు పెట్టిన హీరోయిన్లు ఎవరో తెలుసా..?

Heroines :సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఎలాంటి న్యూస్ అయినా సరే ఇట్టే వైరల్ అవుతుంది. అయితే ఆస్తుల కోసం కొన్ని సార్లు హీరోయిన్లు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన ఘటనలు కూడా ఉన్నాయి. కాగా కొందరు హీరోయిన్లు ఏకంగా తమ సొంత తల్లిదండ్రులపైనే కేసులు పెట్టారు. మరి అలాంటి వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.

కుష్బూ: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించిన కుష్బూ అప్పట్లో ఎన్నో సినిమాల్లో నటించింది. అయితే ఆమె గతంలో తన ఆస్తి కోసం తల్లిదండ్రులపైనే కేసులు పెట్టింది. తనకు తండ్రి లేడు అంటూ అప్పట్లో సంచలన కామెంట్లు చేసింది.

అమీషా పటేల్ః పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన బద్రి సినిమాతో అమీషా పటేల్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది. అయితే ఆమె కూడా గతంలో తన తండ్రిపైనే రూ.12 కోట్ల కోసం దావా కూడా వేసింది.

వనిత విజయ్ కుమార్ : నటిగా వనిత విజయ్ కుమార్ చాలా ఫేమస్. కాగా తల్లిదండ్రులపై కేసు పెట్టిన నటి అంటే అందరికీ టక్కున ఆమెనే గుర్తుకు వస్తుంది. తండ్రి తనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంటూ అప్పట్లో కేసు పెట్టింది ఈమె.

సంగీత : తెలుగు హీరోయిన్ సంగీత అప్పట్లో చాలా సినిమాల్లో నటించింది. కాగా ఆమె ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తోంది. అయితే గతంలో ఆమె తన తల్లిపై సంచలన ఆరోపణలు చేసింది. తన భవిష్యత్ మొత్తాన్ని నాశనం చేస్తోంది తన తల్లే అంటూ ఎన్నో ఇంటర్వ్యూలలో తెలిపింది.

 

Also Read : Director Ramgopal Varma : ఆమెకు అన్నీ జారిపోయాయ్.. ఆమెతో రొమాన్స్ చేయలేదుః ఆర్జీవీ..

Also Read : Bellamkonda Ganesh : బాలయ్య ఇంట్లో కాల్పులపై స్పందించిన బెల్లంకొండ గణేశ్..!

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News