Son for sale : తండ్రి దేవుడితో సమానం అంటారు. తన రక్తం పంచుకొని పుట్టిన పిల్లల భవిష్యత్తు కోసం జీవితాన్నే అంకితం చేసే తండ్రులున్న ఈ లోకంలో ఓ వ్యక్తి నాన్నా అనే పిలుపుకి మచ్చ తెచ్చాడు. ఫాదర్ అంటే చీటర్ అనే చెడ్డ పేరును మూటగట్టుకున్నాడు. అతడికి ఇద్దరు పిల్లలు. ఒక పాప. ఒక బాబు. గొడవల వల్ల భార్య, భర్త లీగల్ గా విడిపోయారు. పాప బాధ్యతను న్యాయస్థానం ఆమె తల్లికి అప్పగించి, బాబు బాధ్యతను తండ్రికి ఇచ్చింది. ఉద్యోగం చేసే ఆ వ్యక్తికి తన కొడుకు బాగోగులను చూసుకోవటం ఇబ్బందిగా మారింది. దీంతో తన తల్లిదండ్రుల వద్ద వదిలి వెళ్లాడు.
చట్టప్రకారం విడాకులు తీసుకున్న అతను కొద్దిరోజుల తర్వాత మరో యువతిని పెళ్లిచేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ‘నీ కొడుకును నువ్వు తీసుకెళ్లు’’ అంటూ పేరెంట్స్ అతనికి సూచించారు. కానీ అతని రెండో భార్య అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఏం చేయాలో అతనికి అర్థంకాలేదు. కుమారుణ్ని ఎలాగైనా వదిలించుకోవాలని భావించాడు. కొడుకును చూడాలని మొదటి కోడలు అడుగుతోందంటూ తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి బాబును తీసుకెళ్లాడు. కానీ ఆ బాలుణ్ని తల్లి దగ్గరికి చేర్చకుండా ఏం చేశాడో ఏమో తెలియదు. ఈలోపు అతని పేరెంట్స్ కి అనుమావం వచ్చింది. మొదటి కోడలికి ఫోన్ చేస్తే బాబు తన దగ్గర లేడని చెప్పింది. వెంటనే వాళ్లు తమ కొడుక్కి కాల్ చేయగా ఫోన్ స్విచ్చాఫ్ అని వస్తుంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Son for sale : a father sold his son for honeymoon with second wife
కేసు నమోదు చేసిన పోలీసులు కూపీ లాగగా అతడి గుట్టు రట్టయింది. కానీ ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచారు. రెండో భార్యతో హనీమూన్ కి వెళ్లిన అతను తిరిగొచ్చేవరకు వేచి చూశారు. వచ్చీ రాగానే అదుపులోకి తీసుకున్నారు. కొడుకును అమ్మి ఆ డబ్బుతో హనీమూన్ కి వెళ్లిన నేరానికి ఆ దంపతులను బొక్కలోకి నెట్టారు. ప్రస్తుతం కటకటాలు లెక్కిస్తున్న ఆ వ్యక్తి తన బాబును దాదాపు రూ.18 లక్షల రూపాయలకు అమ్మినట్లు తేలింది. ఈ దారుణం చైనాలోని జెజియాంగ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.