Sree Leela Health Diseases : టాలీవుడ్ లో వరుస హిట్స్ అందుకుంటూ స్టార్ హీరోయిన్ లకు కూడా అందకుండా దూసుకు వెళ్తున్న బ్యూటీ శ్రీలీల.. ఎంతో మంది ముద్దుగుమ్మలను వెనక్కి నెట్టి మరీ ఈ భామ టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా దూసుకు పోతుంది. పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమె తెలుగు ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయ్యింది. దీంతో ఈమె టాలెంట్ ను టాలీవుడ్ విడిచి పెట్టలేదు.
ఈమెకు వరుస అవకాశాలు ఇచ్చి మరీ ఇక్కడే ఉండేలా చేసారు.. ఈమె నటన, అందం ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసింది.. ఇక ఈ మధ్య వచ్చిన ధమాకా సినిమా సూపర్ హిట్ అవ్వడంతో మరింత గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ సినిమా హిట్ తర్వాత శ్రీలీల మరిన్ని అవకాశాలు అందుకుంటుంది..
కుర్ర హీరోల సరసన మాత్రమే కాదు స్టార్ హీరోల సరసన కూడా అవకాశాలు అందుకుంటూ దూసుకు పోతున్న ఈ బ్యూటీకి ఒక రేర్ జబ్బు ఉందట. ఈ విషయం తాజాగా నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మరి ఆ జబ్బు ఏంటంటే ఆమెకు తుమ్ములు కంటిన్యూగా వస్తూనే ఉంటాయట.. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
ఈమెకు కోల్డ్ వాటర్ తగిలితే చాలట.. తుమ్ముతూనే ఉంటానని చెప్పుకొచ్చింది. అందుకే ఈమె కోల్డ్ చేసే ప్రోడక్ట్స్ కు దూరంగా ఉంటుందట.. ఎప్పుడైనా అలా తగిలితే ఇక షూటింగ్ కు ప్యాకప్ చెప్పాల్సిందేనని ఈమె ఓపెన్ గా చెప్పుకొచ్చింది.. ఈ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది..
Read Also : Vani Bhojan : ఛాన్స్ అడిగితే బెడ్ రూమ్ కు రమ్మన్నాడు.. విజయ్ దేవరకొండ హీరోయిన్ సంచలనం..!
Read Also : Soundarya : సౌందర్య సంపాదించిన వేల కోట్ల ఆస్తి ఎవరు తీసుకున్నారో తెలుసా..?