Mega Family : మెగా ఫ్యామిలీకి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఈ ఫ్యామిలీ నుంచే ఎక్కువ మంది స్టార్ హీరోలు ఉన్నారు. ఇప్పటి వరకు ఏ ఫ్యామిలీకి లేనంత ఫ్యాన్ బేస్ ఈ ఫ్యామిలీ సొంతం అయిపోయింది. మెగా స్టార్ చిరంజీవి ఒక్కడిగా వచ్చి సృష్టించిన మెగా ప్రపంచంలో ఇప్పుడు ఎంతో మంది స్టార్లుగా రాణిస్తున్నారు.
అయితే ఈ ఫ్యామిలీ నుంచి హీరోయిన్లు కూడా ఇప్పుడిప్పుడే ఎంట్రీ ఇస్తున్నారు. మెగ డాటర్ నిహారిక గతంలో హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది. కానీ ఎందుకో సక్సెస్ కాలేకపోయింది. అయితే ఇప్పుడు మరో అమ్మాయి కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయిందంట.
ఆమె ఎవరో కాదు చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కూతురు నివృతి. అంటే మెగాస్టార్ మనవరాలు. ఈమె వయసు ఇప్పుడు 15 ఏండ్లు. త్వరలోనే ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని చూస్తోందంట. దాని కోసం ఇప్పటి నుంచే యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటోందంట. అలాగే డ్యాన్స్, యాక్షన్ సీన్లు కూడా ప్రాక్టీస్ చేస్తుందంట.
అయితే ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం మాత్రం మెగా ఫ్యాన్స్ కు అస్సలు లేనట్టుంది. అందుకే సోషల్ మీడియాలో నివృతి హీరోయిన్ గా వద్దు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అసలు మెగా ఫ్యామిలీ నుంచి ఏ హీరోయిన్ కూడా వద్దు బాబోయ్ అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Also Read : Chiranjeevi : చిరంజీవి కోసం బట్టల్లేకుండా యాక్ట్ చేస్తా.. స్టార్ హీరోయిన్ బోల్డ్ స్టేట్ మెంట్..!
Also Read : Mass Maharaja Ravi Teja : అలాంటి వ్యాధితో బాధపడుతున్న రవితేజ.. అందుకే ముఖం ఇలా అయిందా..?