Sri Reddy Controversial Comments On Mega Family : మెగా ఫ్యామిలీకి టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానం ఉంది. దాన్ని ఎవరూ కాదనలేరు. ఈ ఫ్యామిలీ నుంచే ఎక్కువ మంది స్టార్ హీరోలు ఉన్నారు. అగ్ర హీరోలు అందరూ ఈ కుటుంబం నుంచే వచ్చారు. కాగా ఈ కుటుంబాన్ని పొగిడేవారు ఎంత మంది ఉన్నారో.. తిట్టే వారు కూడా కొందరు ఉన్నారని చెప్పుకోవాలి.
అలాంటి వారిలో శ్రీరెడ్డి ముందు వరుసలో ఉంటుంది. ఆమె మీటూ ఉద్యమ సమయం నుంచే మెగా హీరోలను టార్గెట్ చేస్తూ వస్తోంది. ఇప్పుడు నిహారిక విడాకుల వార్త ఆమెకు పెద్ద ఆయుధంగా మారిపోయింది. నిహారిక తన భర్త నుంచి విడాకులు తీసుకున్నానని అధికారికంగా ప్రకటించడంతో ఆమె మరోసారి విరుచుకుపడింది.
తాజాగా ఆమె మాట్లాడుతూ.. ఈ మెగా హీరోలు పెద్ద నీతులు చెబుతారు. కానీ చేసేవన్నీ నీతిమాలిన పనులు. ముందు వాళ్ల కూతుర్లను పద్ధతిగా పెంచుకోండి. ఆ తర్వాత జనాలకు చెప్పండి. కూతుర్లను కంట్రోల్ చేయలేని మీ మెగా హీరోలు అందరూ చీరలు కట్టుకుని.. గాజులు తొడుక్కోండి.
అంతే గానీ.. జనాలను పిచ్చోళ్లను చేయకండి. మీకు ఇంట్లో లేడీస్ ను కంట్రోల్ చేయడమే రాదు. కానీ ఏపీ రాజకీయాల్లో ఏం చేస్తారు. ఆ పవన్ కల్యాన్ లాగానే ఆ మెగా డాటర్లందరూ విడాకులు తీసుకుంటున్నారు. వాళ్లకు మొగుడంటే లెక్కలేదు.
అందుకే ఇలా పెళ్లిళ్లు పెటాకులు అవుతున్నాయ్ అంటూ వివాదం రేపే కామెంట్లు చేసింది శ్రీరెడ్డి. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఆమె మీద మెగా ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు.
Read Also : Photo Of Mishti Chakraborty Drink Gone Viral : మందు తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ హీరోయిన్.. ఎవరంటే..!