Sri Reddy Controversial Comments On Tollywood Directors : తెలుగు డైరెక్టర్లందరూ పడుకుంటావా అని అడిగారు.. శ్రీరెడ్డి మరో దుమారం..!

Sri Reddy Controversial Comments On Tollywood Directors : టాలీవుడ్ లో శ్రీరెడ్డి చాలామందిపై ఇలాంటి ఆరోపణలు చేసింది. దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ మీద, నేచురల్ స్టార్ నాని మీద ఆరోపణలు చేయడమే కాకుండా కొన్ని ఆధారాలను కూడా బయట పెట్టేసింది..

By: jyothi

Updated On - Fri - 14 July 23

Sri Reddy Controversial Comments On Tollywood Directors : తెలుగు డైరెక్టర్లందరూ పడుకుంటావా అని అడిగారు.. శ్రీరెడ్డి మరో దుమారం..!

Sri Reddy Controversial Comments On Tollywood Directors :  వివాదాస్పద బ్యూటీ శ్రీరెడ్డి గురించి అందరికీ తెలిసిందే. ఆమె ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి కామెంట్లు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో హీరోయిన్ గా చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత మీటూ ఉద్యమంతో బాగా ఫేమస్ అయిపోయింది. అప్పటి నుంచే ఎవరి మీద పడితే వారి మీద ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తోంది.

ఇప్పటికే టాలీవుడ్ లో శ్రీరెడ్డి చాలామందిపై ఇలాంటి ఆరోపణలు చేసింది. దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ మీద, నేచురల్ స్టార్ నాని మీద ఆరోపణలు చేయడమే కాకుండా కొన్ని ఆధారాలను కూడా బయట పెట్టేసింది. అప్పటి నుంచి ఆమెను ఇండస్ట్రీ బ్యాన్ చేసేసింది. కానీ ఆమె మాత్రం ఇలాంటివి అనడం ఆపట్లేదు.

మరో వివాదం..

ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఆమె ఏదో ఒక బాంబ్ లాంటి ఆరోపణలు చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు మరో కాంట్రవర్సీ కామెంట్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. టాలీవుడ్ లో దాదాపు అందరూ అమ్మాయిలను ఆటబొమ్మలుగానే చూస్తారు. టాలీవుడ్ లో ఉన్న డైరెక్టర్లు అందరూ నన్ను పడుకుంటావా అని అడిగారు.

ఎవరూ పత్తిత్తు కాదు. అందరూ దొంగలే. కాకపోతే పెద్ద డైరెక్టర్లు, ఇండస్ట్రీకి పెద్దలు అని బిల్డప్ లు కొడుతుంటారు. అందుకే తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు ఛాన్సులు రావట్లేదు అంటూ ఆరోపించింది శ్రీరెడ్డి. ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. నీ ముఖానికి అంత సీన్ లేదులే అంటూ కామెంట్లు పెడుతున్నారు.

 

Read Also  : Actress Shalu Shammu Commented On Tollywood Hero : తెలుగు హీరోతో పడుకుంటే ఛాన్స్ ఇస్తానన్నాడు.. ప్రముఖ నటి సంచలనం..!

Read Also : Manjari Fadnis Sensational Comments On Producer : ఛాన్స్ అడిగితే ఆ నిర్మాతలు సె* చేయాలన్నారు.. టాలీవుడ్ హీరోయిన్ సెన్సేషన్..!

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News