Sri Reddy : సౌత్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీ బ్యూటీ శ్రీరెడ్డి అంటే తెలియని వారుండరు. ఆమె ఏం మాట్లాడినా సరే అది చివరకు కాంట్రవర్సీనే అవుతుంది. ఒకప్పుడు ఆమె హీరోయిన్ గా రెండు సినిమాలు చేసింది. కానీ ఎక్కువగా అవకాశాలు రాకపోవడం, ఆ తర్వాత కాస్టింగ్ కౌచ్ మీద మీటూ ఉద్యమం చేయడంతో ఆమె సంచలనం అయిపోయింది.
కానీ తనకు వచ్చిన క్రేజ్ ను కాపాడుకోలేకపోయింది. హీరోలను వ్యక్తిగతగా టార్గెట్ చేయడంతో ఇండస్ట్రీ ఆమెను బ్యాన్ చేసింది. ఇప్పుడు యూట్యూబ్ ఛానెల్ పెట్టుకుని అందులో హీరోలపై లేనిపోని ఆరోపణలు చేస్తోంది. ఇదిలా ఉండగా ఆమెకు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
ఆమెకు గతంలో పెండ్లి అయింది. అవును ఇది నిజమే. ఆమె బ్యూటీ పార్లర్ పెట్టుకోవడంతో ఆమె బిహేవియర్ నచ్చని తల్లిదండ్రులు ఆమెను ఒప్పించి పెండ్లి చేశారు. తర్వాత ఆమె భర్తతో కొంత కాలం కాపురం చేశాక.. అతని బిహేవియర్ నచ్చక ఒక కూతురును కన్న తర్వాత అతని నుంచి విడాకులు తీసుకుందంట.
కూతురును భర్తకే వదిలేసి ఆమె వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆమె కూతురు స్కూల్ లో చదువుతున్నట్టు సమాచారం. ఇక భర్త, కూతురును వదిలేసి ఆమె ఇండస్ట్రీలో హీరోయిన్ అవుదామని వచ్చింది. చివరకు కాంట్రవర్సీ క్వీన్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కువగా కాంట్రవర్సీల్లోనే బతుకుతోంది.
Read Also : Chiranjeevi : చిరంజీవి తన తండ్రితో కలిసి నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా..?
Read Also : Vijayashanthi : చిరంజీవి పెద్ద ముసుగు దొంగ.. దేనికీ పనికిరాడు.. విజయశాంతి సంచలన వ్యాఖ్యలు..!