Sri Reddy : శ్రీరెడ్డి రోజురోజుకూ రెచ్చిపోతోంది. ఆమె చేస్తున్న కామెంట్లు పెద్ద దుమారం రేపే విధంగానే ఉంటున్నాయి. గతంలో ఆమె హీరోయిన్ గా కూడా చేసింది. కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అయితే మధ్యలో ఆమె మీటూ ఉద్యమం ద్వారా బాగా పాపులర్ అయిపోయింది. కానీ దాన్ని ఆమె కాపాడుకోలేకపోయింది.
స్టార్ హీరోలను టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి ఆరోపణలు చేయడంతో ఆమెపై విమర్శలు బాగా పెరిగాయి. చివరకు ఇండస్ట్రీ మొత్తం ఆమెను బ్యాన్ చేసింది. అప్పటి నుంచి ఆమె ప్రధానంగా పవన్ కల్యాణ్ ను, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వస్తోంది. ఎప్పటికప్పుడు వారిపై ఏదో ఒక చెత్త రూమర్ పుట్టిస్తూనే ఉంది.
ఇక తాజాగా మరోసారి మెగా ఫ్యామిలీపై విరుచుకుపడింది ఈ భామ. ఇండస్ట్రీని మెగా ఫ్యామిలీ తన గుప్పిట్లో పెట్టుకుంది. ఆ ఫ్యామిలీ కారణంగా ఇండస్ట్రీ మొత్తం నానా ఇబ్బందులు పడుతోంది. మెగా ఫ్యామిలీ ట్యాలెంట్ ఉన్న వారిని తొక్కేస్తోంది. అసలు వారికి హీరో అయ్యేంత ట్యాలెంట్ కూడా లేదు.
వాళ్లంతా డమ్మీగాళ్లు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. ఆమె చేసిన కామెంట్లతో మెగా ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. శ్రీరెడ్డిని టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. శ్రీరెడ్డి ఇలాంటి చెత్త కామెంట్లు చేసి ఏం సాధిస్తావ్ అంటూ అడుగుతున్నారు.
Read Also : Director Venu Yeldandi : నా ఇంట్లోనే బలగం షూటింగ్.. ఒక్క థాంక్స్ కూడా చెప్పలేదు.. ఇంటి ఓనర్ కామెంట్లు..
Read Also : Taapsee Pannu : హీరోలే కమిట్ మెంట్లు అడిగారు.. తాప్సీ కామెంట్లు వైరల్..!