Sri Reddy : మెగా ఫ్యామిలీ అంటేనే ఒంటికాలిపై లేస్తుంది శ్రీరెడ్డి. ఆమె గతంలో నుంచే కాస్టింగ్ కౌచ్ మీద పోరాటం చేస్తోంది. కానీ ఏం లాభం ఆమె నోటి దూల వల్ల వచ్చిన క్రేజ్ ను పోగొట్టుకుంది. అప్పటి నుంచి ఎలాంటి అవకాశాలు లేక కేవలం తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఎవరి మీద పడితే వారి మీద విరుచుకుపడుతోంది.
ఇక పవన్ అంటే చాలు ఆమెకు ఎక్కడలేని కోపం వచ్చేస్తోంది. ప్రస్తుతం ఆమె వైసీపీకి మద్దతు దారుగా ఉంటుంది. అందుకే జనసేన మీద అక్కసు వెల్లగక్కుతోంది. ఇదిలా ఉండగా మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి కొన్ని రోజులుగా అస్సలు పడట్లేదన్న విషయం తెలిసిందే. ఈ మ్యాటర్ లోకి తాజాగా శ్రీరెడ్డి కూడా ఎంటర్ అయింది.
ఆమె మాట్లాడుతూ.. అసలు మెగా ఫ్యామిలీ అంతా భజన గాళ్లే. ఒకరితో భజన చేయించుకుని బతుకుతారు. అందులో ఏ ఒక్కడికి కూడా యాక్టింగ్ రాదు. కేవలం బన్నీ ఒక్కడే అసలైన మగాడు. మిగతా వాళ్లంతా చెత్తగాళ్లే అంటూ ఆరోపించింది శ్రీరెడ్డి. బన్నీ తన సొంత ట్యాలెంట్ తోనే ఎదుగుతున్నాడు.
మిగతా వారంతా ఇతర హీరోలను తొక్కేసి మీదకు వస్తున్నారు అంటూ దుమ్మెత్తిపోస్తోంది శ్రీరెడ్డి. ఆమె చేసిన కామెంట్లపై మెగా ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. ఇలాంటి నీచైమన కామెంట్లు ఎలా చేస్తావ్ అంటూ కడిగి పారేస్తున్నారు నెటిజన్లు. ఆమె చేసిన కామెంట్లపై మీ అభిప్రాయం ఏంటో కూడా తెలియజేయండి.
Read Also : Ashu Reddy : పెళ్లికి ముందు డేటింగ్ చేస్తేనే బెటర్.. అషురెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!
Read Also : Ram Charan : రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ కాకుండా అడ్డుకున్న బడా నిర్మాత.. ఎవరంటే..?