SS Rajamouli And Prashanth Neel : రాజమౌళి, ప్రశాంత్ నీల్.. ఇద్దరూ ఇద్దరే. డైరెక్షన్ లో ఎవరి స్టైల్ వారిదే. తమ సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్రను సృష్టించారు. రాజమౌళి ఇప్పటికే మూడు సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్రను సృష్టించారు. ఆయన సృష్టించిన పాన్ ఇండియా ట్రెండ్ ను ప్రశాంత్ నీల్ ఫాలో అవుతున్నారు.
కాగా ఈ ఇద్దరూ ఒక సినిమాను తీశారంటే ఇప్పుడు హిట్ గురించి ఎవరూ మాట్లాడుకోరు. ఆ మూవీ ఎంత పెద్ద హిట్ అవుతుంది, ఎంత కలెక్షన్లు సాధిస్తుందో మాత్రమే మాట్లాడుకుంటారు. ఒక సినిమాలో ఏ సీన్ ఎలా చేస్తే హిట్ అవుతుందో ఈ ఇద్దరికీ తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదేమో.
అలాంటి ఈ ఇద్దరూ మెచ్చిన ఏకైక హీరో ఒకరున్నారు. ఒక యాక్టర్ ఎలా నటిస్తే సీన్ పండుతుందో ఈ ఇద్దరికీ బాగా తెలుసు. నటన మీద అంత పట్టు ఉన్న ఈ ఇద్దరికీ ఓ హీరో నటన అంటే చాలా ఇష్టం. ఆయన ఎవరో కాదండోయ్ జూనియర్ ఎన్టీఆర్. అవును జూనియర్ ఎన్టీఆర్ నటన అంటే ఈ ఇద్దరికీ చాలా ఇష్టం.
జూనియర్ ఎన్టీఆర్ నటనకు వీరిద్దరూ పెద్ద అభిమానులు. ఈ విషయాలను వారిద్దరూ ఎన్నో సార్లు చెప్పుకొచ్చారు. ఇండియన్ డైరెక్టర్లు మెచ్చిన ఏకైక హీరోగా ఎన్టీఆర్ కు గుర్తింపు వచ్చింది. మరి ఎంతైనా నటనలో ఎన్టీఆర్ వేరే లెవల్ కదా అంటూ చెప్పుకొస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు.
Read Also : Nidhhi Agerwal : రాత్రి రూమ్ కు పిలిచారు.. నిర్మాత, డైరెక్టర్ పై నిధి అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు..!