SS Rajamouli : రాజమౌళితో సినిమా చేయడానికి స్టార్ హీరోలు కూడా క్యూ కడుతుంటారు. ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని ఇప్పుడు హాలీవుడ్ స్టార్లు కూడా వెయిట్ చేస్తున్నారు. ఆ స్థాయిలో రాజమౌళి ఉన్నాడు మరి. ఇప్పుడు ఆయన తీస్తున్న సినిమాలు అన్నీ ఇండియన్ బాక్సాఫీస్ ను బద్దలు కొడుతున్నాయి.
అయితే హీరోలందరూ రాజమౌళి వెంట పడుతుంటే.. రాజమౌళి మాత్రం ఓ స్టార్ హీరో కోసం ఏండ్లుగా వెయిట్ చేస్తున్నాడంట. ఆయనతో ఎలాగైనా సినిమా చేయాలని రాజమౌళి ఎన్నో సార్లు ప్రయత్నించారంట. కానీ అవేమీ కుదర్లేదంట. ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి రావడంతో ఆ హీరో హ్యాండ్ ఇస్తున్నారంట.
ఇంతకీ ఆయన ఎవరా అనుకుంటున్నారా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. అవును మీరు విన్నది నిజమే. ఇప్పటి వరకు మోహన్ లాల్ తెలుగులో కొన్ని సినిమాలు చేశారు. అయితే మోహన్ లాల్ కోసం చాలా సినిమాల్లో కీలక పాత్రలు సృష్టించారంట రాజమౌళి. కానీ ఏదో ఒక కారణంతో అది కుదరలేదు.
SS Rajamouli Created Important Roles For Malayalam Superstar Mohanlal
కానీ ఇన్నాళ్లకు రాజమౌళి కల నెరవేరిందంట. ప్రస్తుతం ఆయన మహేశ్ బాబుతో చేస్తున్న సినిమాలో కీలక పాత్రను మోహన్ లాల్ కోసం రాసుకున్నారంట. ఆయన ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆయన పాత్ర అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది. కాగా దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
Read Also : Astrologer Venu Swamy : వరుణ్-లావణ్య పెండ్లిని ముందే చెప్పేసిన వేణుస్వామి.. మరో విషాదం తప్పదా…?
Read Also : Vishnu Priya : ఆ డైరెక్టర్ నన్ను రూమ్ కు రమ్మన్నాడు.. విష్ణుప్రియ సంచలనం..!