SS Rajamouli Participated Ad Shooting Of Oppo Mobile Company : రాజమౌళి.. ఇది పేరు కాదు ఓ బ్రాండ్. ఆ బ్రాండ్ నుంచి ఏ సినిమా వచ్చినా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర తిరగరాయాల్సిందే. రికార్డులన్నీ బ్రేక్ అయిపోవాల్సిందే. ప్లాప్ కాదు కదా.. యావరేజ్ టాక్ అనేది కూడా అక్కడ వినపడదు. కేవలం ఎంత పెద్ద హిట్, ఎన్ని కోట్లు రాబట్టింది అనే లెక్కలు మాత్రమే అక్కడ వినిపిస్తాయి.
దటీజ్ రాజమౌళి. ఇండియాలోనే అతిపెద్ద డైరెక్టర్ గా అవతరించిన రాజమౌళి ఇప్పటి వరకు ఒక్క యాడ్ షూట్ కూడా చేయలేదు. కానీ ప్రస్తుతం ఆయన మొదటిసారి ఒప్పో మొబైల్ కంపెనీ యాడ్ షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ షూటింగ్ రాజస్థాన్ లో జరిగింది. ఇందుకు సంబంధించిన పిక్స్ కూడా వైరల్ అవుతున్నాయి.
యాడ్ షూటింగ్ తో పాటు.. అక్కడి ట్రిప్ ను ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ యాడ్ షూట్ కోసం ఆయన భారీగానే తీసుకున్నారంట. సాధారణంగా ఆయన తీసే సినిమాల్లో పర్సెంటేజ్ తీసుకుంటారు. అది హీరోల రెమ్యునరేషన్ కంటే ఎక్కువగానే ఉంటుంది.
తాజాగా యాడ్ షూట్ కోసం రూ.3 కోట్ల వరకు తీసుకున్నాడంట రాజమౌళి. ఇప్పటి వరకు టాలీవుడ్ హీరోలు కూడా ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఎంతైనా రాజమౌళి రేంజ్ వేరే కదా. ఆ మాత్రం తీసుకోవడం తక్కువేం కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు జక్కన్న ఫ్యాన్స్.
Read Also : Tamannaah Bhatia Bold Comments : ప్రతి మనిషికి శృంగారం చాలా అవసరం.. తమన్నా ఏంటీ మాటలు..!
Read Also : Surekha Vani Drug Case : సురేఖ వాణి కెరీర్ నాశనం అవ్వడానికి కారణం ఆ స్టార్ హీరోనా..?