ట్రెండ్ మారుతోందంటే ఏమో అనుకున్నాం గానీ.. మరీ దారుణంగా తయారవుతోంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలోనే ఇలాంటి చెత్త ట్రెండ్ క్రియేట్ అవుతోంది. ఆ తర్వాతనే అది సమాజంలోకి పాకుతోంది. సినీ ఇండస్ట్రీలో ఉండే స్టార్లు అడ్వాన్స్ డ్ కల్చర్ ను అందరికీ పరిచయం చేస్తున్నారు. ఇలాంటి కల్చర్ లో ఒకటి ఏంటంటే.. చాలామంది పెండ్లికి ముందే ప్రెగ్నెంట్ అవుతున్నారు. వారు ఎవరో చూద్దాం.
ఆలియాభట్..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన ఆలియా భట్ పెళ్లికి రెండు నెలల ముందే ప్రెగ్నెంట్ అయింది. ఆ తర్వాతనే ఆమె తన ప్రియుడు రణ్ బీర్ కపూర్ ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ చేశారు. ఆ సమయంలోనే ఆలియా ప్రెగ్నెంట్ కావడంతో.. ఆగమేఘాల మీద పెళ్లి చేసుకున్నారు.
అమీ జాక్సన్..
సౌత్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన భామ అమీ జాక్సన్. ఆమె లండన్ కు చెందిన బ్యూటీ. అయితే ఆమె కూడా పెళ్లకి ముందే తన ప్రియుడితో కక్కుర్తి పడింది. ఇంకేముంది పెళ్లి కాకముందే ప్రెగ్నెంట్ అయి బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ప్రియుడిని పెళ్లి చేసుకోకుండా బ్రేకప్ చెప్పేసింది. ఇప్పుడు పెళ్లి కాకుండానే కొడుకును పోషిస్తోంది.
ఇలియానా..
గోవా బ్యూటీ ఇలియానా కూడా ఇదే బాట పట్టింది. ఆమె చాలా మందితో డేటింగ్ చేసింది. కానీ ఎందుకో అందరినీ మధ్యలోనే వదిలేసింది. సడెన్ గా తాను ప్రెగ్నెంట్ అంటూ బాంబ్ పేల్చింది. ప్రస్తుతం ఇలియానా నిండు గర్భిణి. కానీ తన ప్రెగ్నెన్సీకి కారణం ఎవరో చెప్పట్లేదు. అప్పుడప్పుడు తన ప్రియుడి ముఖం కనిపించకుండా ఫొటోలు షేర్ చేస్తోంది. పెళ్లి కాకుండానే బిడ్డను కనేందుకు రెడీ అయింది.
వీరిలాగానే దియామీర్జీ, నేహా దూపియాలు కూడా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యారు. ఆ తర్వాత వారు తమ ప్రియుడిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయారు. ఈ ట్రెండ్ వల్ల వారిని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఏదేమైనా వారు చేసిన పని వారినే ఇబ్బంది పెడుతోంది.