Sunny Leone Comments On Porn Movies : సన్నీలియోన్ అనగానే అందరికీ పోర్న్ స్టార్ అని గుర్తుకు వస్తుంది. కానీ ఆమె వ్యక్తిగత జీవితం గురించి మాత్రం ఎవరికీ పెద్దగా తెలియదు. ఆమె ఇండియన్ మూలాలు ఉన్న కెనడా అమ్మాయి. కాగా చిన్నప్పటి నుంచే ఆమెకు పోర్న్ స్టార్ కావాలనే ఆశ ఉండేది. అందుకే ఆ రంగలోకి వెళ్లిపోయింది. పోర్న్ స్టార్ గా ప్రపంచాన్ని ఊపేసింది.
ఆ తర్వాత బాలీవుడ్ కు వచ్చి సెటిల్ అయిపోయింది. అప్పటి నుంచి ఆమె పోర్న్ సినిమాలను వదిలేసింది. కాగా ఆమె జీవితంపై అప్పట్లో బయోపిక్ ను కూడా తీశారు. అప్పట్లో అదో సంచలనం. అయితే తాజాగా ఆ సినిమా విడుదలై నాలుగేండ్లు అవుతున్న సందర్భంగా ఆ మూవీ గురించి మాట్లాడింది సన్నీలియోన్.
ఓ ఇంటర్వ్యూలో దీనిపై సమాధానాలు చెప్పింది. ఈ సినిమాలో నా సెక్స్ సినిమాలను కూడా క్లియర్ గా తీసేశారు. ఎక్కడా ఏమీ దాచకుండా మూవీని తీశారు. అయితే ఆ సినిమాను మా తమ్ముడు చూడలేదు. నేను వద్దన్నాను. ఎందుకంటే నా తమ్ముడు నా సెక్స్ సీన్లను చూస్తే బాగోదు.
నా తమ్ముడిగా అతను నా గురించి ఇలాంటి సీన్లను చూడొద్దని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఆ ఇండస్ట్రీలోనే లేను. అది గడిచిపోయిన కాలం. కానీ నా గతం గురించి నేను ఎప్పుడూ పశ్చాత్తాప పడలేదు. ఎప్పుడు జీవితాన్ని ఆస్వాదించడమే నేను నేర్చుకున్నాను అంటూ తెలిపింది సన్నీలియోన్.