Supreeta : క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె ఇప్పటికే వందకు పైగా సినిమాల్లో నటించింది. చాలా సినిమాల్లో కమెడియన్లకు భార్య పాత్రలో నటించి మెప్పించింది ఈ భామ. అయితే ఈ నడుమ ఆమెకు పెద్దగా అవకాశాలు రావట్లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటుంది.
ఆమె భర్త చినపోయినప్పటి నుంచి కూతురుతోనే కలిసి ఉంటుంది. కూతురుతో కలిసి డ్యాన్స్ వీడియోలు, రీల్స్ చేస్తూ హంగామా చేస్తోంది. ఈ క్రమంలోనే సురేఖ వాణి మళ్లీ పెళ్లి చేసుకుంటుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె కూతురు సుప్రీత కూడా స్పందించింది.
త్వరలోనే అమ్మకు మళ్లీ పెళ్లి చేస్తా అంటూ తెలిపింది. ప్రస్తుతం సురేఖ వాణి వయసు నాలుగు పదులు దాటిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా సుప్రీత అభిమానులతో ఇన్ స్టాలో చిట్ చాట్ చేసింది. మీ అమ్మకు మళ్లీ పెళ్లి ఎప్పుడు చేస్తావ్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దానికి సుప్రీత స్వీట్ గా రిప్లై ఇచ్చింది.
మంచి అబ్బాయి ఉంటే చూడండి. త్వరలోనే పెండ్లి చేస్తా అంటూ ఫన్నీగా మీమ్ ను యాడ్ చేసి ఆన్సర్ ఇచ్చింది. ఇది చూసిన కొందరు ఆకతాయిలు మేం రెడీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో.. నువ్వు పెళ్లి చేసుకునే వయసులో మీ అమ్మకు చేస్తావా ఇదేం తీరు తల్లీ అంటూ ఫైర్ అవుతున్నారు.
Read Also : SS Rajamouli : ఆ హీరోతో సినిమా కోసం ఏళ్లుగా వెయిట్ చేస్తున్నా.. రాజమౌళి కామెంట్లు వైరల్..!
Read Also : Senior NTR : అందరి ముందే ఆ హీరో కాళ్లు మొక్కిన సీనియర్ ఎన్టీఆర్.. ఎందుకంటే..?