Karthi : తమిళ హీరోలు సూర్య-కార్తీల అనుబంధం గురించి అందరికీ తెలుసు. వీరిద్దరూ ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే చాలా కలిసి మెలిసి ఉంటారు. ఇప్పటికీ ఒకరికి ఒకరు సపోర్టుగా నిలబడుతుంటారు. తమ్ముడు కార్తీని సూర్య ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. అయితే ఇదంతా బయటి ప్రపంచానికి తెలిసిన విషయం.
కానీ అదంతా నిజం కాదని తమ్ముడు కార్తీ తాజాగా వివరించాడు. రీసెంట్ గా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. ఇద్దరు అన్నాదమ్ములు ఉన్న ఇల్లు రణరంగంలాగానే ఉంటుంది. ఎక్కడైనా పెద్దవాడు సాఫ్ట్ గా ఉంటాడు. కానీ మా ఇంట్లో అదంతా రివర్స్. నేనే సాఫ్ట్ గా ఉంటాను.
సూర్య తనకు నచ్చిందే చేస్తాడు. అన్నయ్యకు చాలా పొగరెక్కువ. ఎవరి మాటలు వినేవాడు కాదు. నన్ను, చెల్లిని సూర్య చాలా ఏడిపించేవాడు. చిన్నప్పుడు చాలా సార్లు నన్ను కొట్టేవాడు. దాంతో నేను బోరుమని ఏడ్చేవాడిని. ఇంటర్ వచ్చే సమయానికి సూర్య కంటే కాస్త హైట్ పెరిగాను.
దాంతో నన్ను తన పక్కన నడవొద్దని.. కనీసం 10 అడుగుల దూరంలో నడవాలని కండీషన్ పెట్టాడు. కానీ పెద్దయ్యాక మేం చాలా మారిపోయాం. నేను యూఎస్ కు చదువుకోవడానికి వెళ్లాను. ఆ సమయంలోనే సూర్య ఇండస్ట్రీలోకి వచ్చాడు. అతను స్టార్ అవ్వడానికి చాలా కష్టపడ్డాడు. నన్ను సినిమాల్లో ఈ స్థాయిలో ఉంచడానికి సూర్య చాలా సపోర్టు చేశాడు. మేమిద్దరం ఇప్పుడు ఒకే ఇంట్లో ఉంటున్నాం అంటూ చెప్పుకొచ్చాడు కార్తీ.
Read Also : Shruti Haasan : నువ్వు వర్జినా..? నెటిజన్ ప్రశ్న.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇచ్చిన శృతి..!
Read Also : Jeevitha Rajasekhar : రూమ్ కు రమ్మని ఇబ్బంది పెట్టాడు.. జీవిత రాజశేఖర్ సంచలన ఆరోపణలు..!