Taapsee Pannu Made Comments On Tollywood Hero : తాప్సీ ఇప్పుడు బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తోంది. ఆమె అంతకు ముందు సౌత్ ఇండస్ట్రీలో బాగానే సినిమాలు చేసింది. కానీ ఇక్కడ ఎక్కువగా ఆమెకు మెయిన్ హీరోయిన్ గా అవకాశాలు రాలేదు. దాంతో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. ఆ క్రమంలోనే ఆమె బాలీవుడ్ బాట పట్టింది.
అక్కడ బాగానే సినిమాల్లో నటిస్తోంది. కానీ ఆమె వ్యక్తిగత కామెంట్లతో ఎప్పటికప్పుడు వార్తల్లో ఉంటుంది. ఆమెకు ఫైర్ బ్రాండ్ అనే గుర్తింపు కూడా వచ్చింది. అయితే రీసెంట్ గా ఆమె టాలీవుడ్ మీద చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. ఆమె మాట్లాడుతూ.. నేను తెలుగులో చాలా మంది హీరోలతో పని చేశాను.
ఎవరితో నాకు సమస్యలు రాలేదు. కానీ ఓ హీరో మాత్రం ప్రేమ పేరుతో నన్ను ఇబ్బంది పెట్టాడు. అతనిది నిజమైన ప్రేమ కాదని నాకు తెలుసు. కేవలం నా మీద ఉన్న ఇంట్రెస్ట్ తోనే ఆయన అలా వేధించాడు. అతనితో సినిమా పూర్తయ్యే వరకు ఇబ్బంది పడ్డాను. షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత అతని నెంబర్ బ్లాక్ లో పెట్టేశాను.
మళ్లీ అతన్ని జీవితంలో కలవలేదు. ఇప్పుడు అతను మంచి పొజీషన్ లో ఉన్నాడు. కానీ అతని పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు అంటూ వ్యాఖ్యానించింది తాప్సీ. మరి తాప్సీని అంతగా ఇబ్బంది పెట్టిన తెలుగు హీరో ఎవరా అని అంతా ఆరా తీస్తున్నారు.
Also Read : Anchor Sreemukhi Reacts On Casting Couch : ఆ డైరెక్టర్ అసభ్యకరంగా తాకాడు.. శ్రీముఖి సెన్సేషనల్..!
Also Read : Rashmika Mandanna Comments Shocked Vijay Deverakonda : ఆ హీరోతో లిప్ కిస్ చేయాలని ఉంది.. రష్మిక కామెంట్లు.. విజయ్ కు షాక్..!