Taapsee Pannu : హీరోయిన్ గా తాప్సీకి ఉన్న క్రేజ్ ఇప్పుడు అందరికీ తెలిసిందే. ఆమె ప్రస్తుతం బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్నారు. గతంలో ఆమె సౌత్ లో చాలా సినిమాల్లో నటించింది. ఇక్కడ స్టార్ హీరోయిన్ అవుతుందనుకున్న సమయంలోనే ఆమె బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి అక్కడ వరుసగా సినిమాలు చేస్తోంది.
ఇక ఎప్పటికప్పుడు సినిమాలతో పాటు కాంట్రవర్సీల్లో కూడా బాగానే నిలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిల సమస్యలు, హీరోయిన్ల రెమ్యునరేషన్లు పెంపు గురించి మాట్లాడటంలో ఆమె ముందు ఉంటుంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ.. మరిన్ని కాంట్రవర్సీ కామెంట్లు చేసింది.
ఆమె మాట్లాడుతూ.. చాలామంది అమ్మాయిల ఎక్స్ పోజింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు అమ్మాయిలు అంటేనే అందానికి కేరాఫ్ అడ్రస్. అలాంటప్పుడు అందంగా ఉంటే చూపించుకోవడంలో తప్పేముంది. అబ్బాయిలు అమ్మాయిల ప్రైవేట్ పార్టులను వద్దన్నా చూసేస్తారు.
అలాంటప్పుడు అమ్మాయిలను తప్పు పడితే ఎలా. అమ్మాయిల డ్రెస్ కల్చర్ అనేది వారి ఇష్టం. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎవరు ఎలా అయినా డ్రెస్ వేసుకోవచ్చు. అంత మాత్రానా డ్రెస్ ను బట్టి అమ్మాయిల క్యారెక్టర్ ను డిసైడ్ చేస్తే ఎలా అంటూ దుమారం రేపే కామెంట్లు చేసింది తాప్సీ.
Read Also : Bichagadu 2 Movie Review : ‘బిచ్చగాడు 2’ రివ్యూ.. అంచనాలు అందుకుందా..?
Read Also : Naga Babu : అప్పుల్లో కూరుకుపోయి చనిపోవాలనుకున్న నాగబాబు.. ఆదుకున్న నిర్మాత ఎవరో తెలుసా..?