Taapsee Pannu : హీరోయిన్ తాప్సీ ఇప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంటుంది. ఆమె అక్కడే ఎక్కువగా సినిమాలు చేస్తోంది. ఆమె గతంలో తెలుగులో స్టార్ హీరోల సరసన అవకాశాలు పట్టేసింది. కానీ ఇక్కడ కంటే కూడా ఆమెకు బాలీవుడ్ లోనే స్టార్ స్టేటస్ వచ్చిందని చెప్పుకోవాలి. ఇక ఆమె ముక్కు సూటి మనిషిగా పేరు తెచ్చుకుంది.
ఎక్కువగా కాంట్రవర్సీలకు తాప్సీ కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ వస్తోంది. అయితే ఆమె ఎక్కువగా హీరోయిన్ల రెమ్యునరేషన్, వారి హక్కుల గురించి పోరాడుతూనే ఉంటుంది. మహిళలకు ఎక్కడ ఏం జరిగినా సరే స్పందిస్తూ వస్తోంది ఈ భామ. తాజాగా ఆమె హీరోయిన్లపై చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
ఆమె మాట్లాడుతూ.. కొందరు హీరోయిన్లు నాలాగా ఫ్రాంట్ గా ఉండరు. తెర వెనక నీచమైన పనులు చేసి డబ్బులు సంపాదిస్తారు. పైగా అలాంటి వారే ఎక్కువగా నీతులు మాట్లాడుతారు. కాబట్టి అలాంటి వారి గురించి నేను ఎక్కువగా పట్టించుకోను. ఇక్కడ ట్యాలెంట్ ఉన్న వారి కంటే అలాంటి వారే ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు.
కాబట్టి అలాంటి వారి గురించి ఎంత చెప్పినా టైమ్ వేస్ట్ అని చెప్పుకొచ్చింది తాప్సీ. ఆమె ఇన్ డైరెక్టుగా హీరోయిన్లు కమిట్ మెంట్లు ఇచ్చి డబ్బులు సంపాదిస్తారని చెబుతోందన్న మాట. ఇలాంటి కామెంట్లు తాప్సీ చేయడం ఇది కొత్తేం కాదు. కానీ ఇంత ఓపెన్ గా ఆమె కామెంట్లు చేయడం మాత్రం ఇదే మొదటిసారి.
Also Read : Saikumar : సాయికుమార్ ను చంపేస్తా అంటూ బెదిరించిన స్టార్ హీరో.. ఎందుకంటే..?
Also Read : Jayachitra : ఆ హీరోయిన్ ను చెప్పుతో కొట్టిన జయసుధ.. ఎందుకంటే..?