Tamannaah Bhatia : తమన్నా.. కుర్రాళ్లకు కలల రాకుమారి. ఆమె స్క్రీన్ పై కనిపిస్తే చాలు కుర్రాళ్లు ఎగబడి మరీ చూస్తుంటారు. అందుకే ఆమెకు అంతటి ఫాలోయింగ్ ఉందని చెప్పుకోవాలి. ఆమె కెరీర్ లో హిట్ల కన్నా ప్లాపులే ఎక్కువ. కానీ ఆమెకు మాత్రం బాగానే అవకాశాలు వస్తున్నాయంటే ఇదంతా కుర్రాళ్లలో ఆమె అందాలకు ఉన్న పాలోయింగ్ అనే చెప్పుకోవాలి.
అయితే తమన్నా మాత్రం సినిమాల్లో కొన్ని కండీషన్లు పెట్టుకుంది. కేవలం గ్లామర్ ఎక్స్ పోజింగ్ మాత్రమే చేస్తానని లిప్ లాక్ లాంటివి చేయనని కండీషన్ పెట్టుకుంది. అందుకే ఇప్పటి వరకు ఏ హీరోకు కూడా ఈ లిప్ లాక్ ఇవ్వలేదు. అయితే ఆమె గతంలో ఓ స్టార్ హీరోకు మాత్రమే లిప్ లాక్ ఇచ్చింది.
అతను ఎవరో కాదండోయ్ స్టార్ హీరో సూర్య. అవును.. సూర్య అంటే తమన్నాకు క్రష్. అందుకే ఆయన కోసం తన కండీషన్ పక్కన పెట్టేసి మరీ ఆ పని చేసింది తమన్నా. వీరిద్దరూ కలిసి వీడొక్కడే సినిమాలో నటించారు. ఆ సినిమాలో సూర్య బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ లిప్ లాక్ కిస్ ను క్రియేట్ చేశారు.
అయితే ఈ సీన్ కు తమన్నా ఒప్పుకుంటుందో లేదో అనే అనుమానం డైరెక్టర్ కు ఉండేది. కానీ ఈ సీన్ చెప్పగానే తమన్నా కూడా వెంటనే ఒప్పుకుందంట. ఆ సినిమా తర్వాత మరే హీరోకు కూడా ఇప్పటి వరకు తమన్నా లిప్ లాక్ ఇవ్వలేదు. ఇక ప్రస్తుతం ఆమె విజయ్ వర్మతో డేటింగ్ చేస్తోంది. అతనికి మాత్రం లిప్ లాక్ ఇచ్చిందనే టాక్ ఉంది.
Read Also : Priyamani : ప్రియమణి-తరుణ్ పెళ్లి చేసుకోకుండా అడ్డుపడ్డ స్టార్ హీరో.. కారణం అదే..!
Read Also : Alia Bhatt : నాలుగేండ్లు ఆ ఇంట్లోనే సహజీవనం చేశాం.. ఆలియాభట్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు..!