Tamannaah Bhatia : మిల్కీ బ్యూటీ తమన్నాకు నేషనల్ వైడ్ గా ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఆమె అందాలకు సామాన్య జనాల దగ్గరి నుంచి స్టార్ హీరోల దాకా అందరూ అభిమానులే. అసలు హిట్ రేటు లేకుండా ఎవరికైనా ఇంత కాలం అవకాశాలు వస్తాయా.. అంటే అవును వస్తాయి కేవలం తమన్నాకు మాత్రమే వస్తాయి.
ఎందుకంటే తమన్నా అందాలకు యూత్ లో ఉన్న క్రేజ్ అలాంటిది. కేవలం తమన్నా వెండితెరపై కనిపిస్తే చాలు అనుకునే జనాలు చాలామందే ఉన్నారు. అయితే ఇంత మంది హీరోలు తమన్నా అంటే పడి చస్తుంటే ఆమె మాత్రం ఓ స్టార్ హీరోను పెండ్లి చేసుకోవాలని ఆశ పడింది.
ఆ విషయం ఆమెనే స్వయంగా గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. నేను తమిళ స్టార్ హీరో సూర్యతో గతంలో ఓ సినిమా చేశాను. ఆ సమయంలో అతని మంచి తనం, క్యారెక్టర్ చూసి నిజంగా పడిపోయాను. నాకు తెలియకుండానే ఆయనతో ప్రేమలో పడ్డాను. ఆయన్ను పెండ్లి చేసుకుంటానని నేరుగానే చెప్పేశాను.
కానీ ఆయన మాత్రం నాకు షాక్ ఇచ్చారు. అప్పటికే ఆయనకు పెండ్లి అయిందని చెప్పారు. దాంతో చాలా బాధ పడ్డాను. నిజంగా ఆయన్ను చేసుకునే ఛాన్స్ మిస్ చేసుకున్నాను. కానీ నాకేం బాధ లేదు. ఆయనలాంటి వ్యక్తి నాకు భర్తగా వస్తారని ఆశపడుతున్నా అంటూ సిగ్గుపడుతూ చెప్పుకొచ్చింది తమన్నా.
Read Also : Varun Tej : ఆ ఒక్క సినిమా చేసుంటే వరుణ్ తేజ్ స్టార్ హీరో అయ్యేవాడే.. బ్యాడ్ లక్..!
Read Also : Ileana D’Cruz : టాలీవుడ్ హీరోలే కమిట్ మెంట్ అడిగారు.. ఇలియానా షాకింగ్ కామెంట్లు..!