Tamannaah Bhatia : మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు బాలీవుడ్ కు షిఫ్ట్ అయిపోయింది. ఏజ్ అయిపోయిన తర్వాత ఆమె ఇలా బాలీవుడ్ కు వెళ్లడం ఆశ్చ్యంగానే ఉంది. అయితే సౌత్ ఇండస్ట్రీలో ఆమెకు ఇప్పుడు పెద్దగా అవకాశాలు రావట్లేదు. అందుకే ఇలా బాలీవుడ్ బాట పట్టినట్టు తెలుస్తోంది ఈ భామ. ప్రస్తుతం ఆమె లస్ట్ స్టోరీస్-2లో బోల్డ్ గా నటిస్తోంది.
అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. ఆమె మొదట్లో బాలీవుడ్ లోనే కెరీర్ స్టార్ట్ చేసింది. ఒక సినిమా చేసిన తర్వాత ఆమె సౌత్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయిపోయింది. అయితే తాజాగా నటిస్తున్న జీ కర్దా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది. ఇందులో ఆమె మాట్లాడుతూ బాలీవుడ్ గురించి సంచలన కామెంట్లు చేసింది.
నేను మొదట్లో మోడలింగ్ చేస్తున్నప్పుడు బాలీవుడ్ లో అవకాశాల కోసం బాగానే ప్రయత్నాలు చేశాను. కానీ బాలీవుడ్ లో నా ప్రైవేట్ పార్టుల గురించి చర్చించారు. అది నాకు అస్సలు నచ్చలేదు. కొందరు నా ఎద భాగాల సైజులు పెంచుకోవాలని చెప్పారు. దాంతో చాలా చిరాగ్గా అనిపించింది.
అలా మాట్లాడింది కూడా చాలా పెద్ద స్థాయిలో ఉన్న వారే. దాంతో నాకు బాలీవుడ్ లో అవకాశాల కోసం ట్రై చేయాలని అనిపించలేదు. ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో ఛాన్సులు రావడంతో అక్కడే బిజీగా ఉండిపోయాను. కానీ తర్వాత రియలైజ్ అయ్యాను. ఒకరిద్దరు అలా ఉంటే.. బాలీవుడ్ ను వదిలేయడం కరెక్టు కాదని అనిపించింది.
అందుకే ఇప్పుడు ఇక్కడ అవకాశాలు వస్తే ఓకే చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది తమన్నా. దీని తర్వాత ఆమె నుంచి లస్ట్ స్టోరీస్-2 కూడా రాబోతోంది. ఈ వెబ్ సిరీస్ కోసం దేశ వ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్ లో తమన్నా చాలా బోల్డ్ గా నటిస్తుందని తెలుస్తోంది. మరి ఈ సీన్లు ఎలా ఉంటాయో చూడాలి.
Read Also : Lakshmi Rai : తెలుగు హీరోలు కూడా కోరిక తీర్చమన్నారు.. లక్ష్మీరాయ్ సంచలన ఆరోపణలు..!
Read Also : Sai Dharam Tej : ఇప్పటికే ముగ్గురితో డేటింగ్ చేశా.. సాయిధరమ్ తేజ్ మామూలోడు కాదుగా..!