Mega Star Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి. సినిమా పరంగా ఆయన అన్ని కోణాల్లో నూటికి నూరుశాతం మార్కులు వేయించుకున్నారు. అందుకే ఆయన మెగాస్టార్ చిరంజీవి అయ్యారని చెప్పుకోవాలి. కాగా చిరంజీవి కేవలం హీరోగా మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఆయన సినిమాను డైరెక్ట్ చేశారనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు.
ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. 1995 జూన్ 15న విడుదలైన బిగ్ బాస్ మూవీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమాలో చిరు హీరోగా నటించగా రోజా హీరోయిన్ గా చేసింది. దీనికి విజయ బాపినీడు డైరెక్టర్ గా చేశారు. అయితే ఓ రోజు విజయబాపినీడుకు ఏదో పని ఉండి సెట్స్ కు రాలేకపోయారు.
అప్పటికే డేట్స్ ఇచ్చేసిన చిరంజీవి సెట్స్ కు వచ్చారు. కానీ డైరెక్టర్ లేరనే విషయాన్ని తెలుసుకుని.. సమయం ఎందుకు వృధా చేయడం అని తానే డైరెక్టర్ సీట్లో కూర్చున్నారు చిరు. ఆ రోజు ఒక ఫైట్ సీన్ తో పాటు.. కొన్ని కీలక సన్నివేశాలను డైరెక్ట్ చేశారు చిరు. అచ్చం అనుభవం ఉన్న డైరెక్టర్ లాగా సీన్లను తీశారు.
Tanikella Bharani Made Shocking Statements About Mega Star Chiranjeevi
ఆ మూవీ అప్పట్లో మంచి హిట్ అయింది. ఈ విషయాన్ని బిగ్ బాస్ సినిమాలో కీలక పాత్రలో నటించిన తనికెళ్ల భరణి వివరించారు. చిరంజీవికి సినిమాపై ఉన్న పట్టు బహుషా ఇంకెవరికీ ఉండదేమో అని ఆయన వివరించారు.
Read Also : Heroines : తల్లిదండ్రులపైనే కేసులు పెట్టిన హీరోయిన్లు ఎవరో తెలుసా..?
Read Also : Atharintiki Daaredi Movie : అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్ ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..?