Tejaswi Madivada : తెలుగు అమ్మాయి తేజస్వి మదివాడ చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. కానీ ఎందుకో ఆమె ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. దాంతో కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు వచ్చినా సరే చేసేస్తోంది. ఇక సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే బిగ్ బాస్ లోకి కూడా వెళ్లింది. బిగ్ బాస్ తో ఆమెకు మరింత గుర్తింపు వచ్చింది.
కానీ తేజస్వి మదివాడ మొదటి నుంచి బోల్డ్ అమ్మాయిగానే పేరు తెచ్చుకుంది. ఆమె చేసిన పాత్రల్లో ఎక్కువగా బోల్డ్ నెస్ ఉంటుంది. అయితే తెలుగు అమ్మాయి అయి.. బాలీవుడ్ హీరోయిన్ల రేంజ్ లో అందాలను ఆరబోస్తోంది. కానీ ఆమెకు మాత్రం పెద్దగా అవకాశాలు రావట్లేదు. వీటిపై ఆమె తాజాగా స్పందించింది.
నేను కొన్ని కండీషన్లు పెట్టుకోవడం వల్ల అవకాశాలు దూరం అవుతున్నాయి. కొన్ని వల్గర్ సీన్లలో నటించాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ మన టాలీవుడ్ లో కొందరు అలాంటిసీన్ల కోసమే తీసుకుంటారు. నేను ఓ సినిమాలో నటిస్తున్నప్పుడు నాకు సీన్ చెప్పలేదు. సెట్స్ లో కెమెరా ముందుకు వెళ్లాక టాప్ విప్పసి బెడ్ మీద పడుకో అన్నాడు డైరెక్టర్.
నేను ఎందుకు అన్నాను.. ఇది బెడ్ రూమ్ సీన్ అంటూ చెప్పాడు. అందరి ముందు బట్టలు విప్పేసి అలా చేయడం నాకు ఇబ్బందిగా అనిపించింది. దాంతో ఆ డైరెక్టర్ తో కుదరదని చెప్పేశాను. ఒప్పించేందుకు చాలా ప్రయత్నించారు. కానీ నేను ఒప్పుకోలేదు. దాంతో ఆ సీన్ ను తీసేశారు అంటూ తెలిపింది తేజస్వి మదివాడ.
Read Also : Kajal Aggarwal : కాజల్ తో ఎఫైర్ రూమర్లు వచ్చిన ఏకైక హీరో ఎవరో తెలుసా..?
Read Also : Heroine : మరో నిర్మాతతో ఎఫైర్ స్టార్ట్ చేసిన హీరోయిన్.. ఎంత మందిని పడుతుందో..!