Amazon Offer : మీరు మీ పాత ఫోన్‌తో విసుగుచెంది కొత్త ఫోన్ కొనేందుకు ట్రై చేస్తున్నారా? అయితే ఈ ఆఫర్ మీకోసమే. ఇప్పుడు ఆన్లైన్లో భారీ తగ్గింపు ధరకు సరికొత్త మొబైల్స్‌ను సొంతం చేసుకోవచ్చు. చాలా చౌకధరకు శాంసంగ్ 5జీ ఫోన్ లభిస్తుంది. ఈకామర్స్ సంస్థ అమెజాన్‌లో ఇప్పుడు అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. 75 వేలు విలువైనా స్మార్ట్‌ఫోన్‌ను కేవలం 19 వేలకే మీ సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ గురించి మరిన్ని వివరాల ఇప్పుడు తెలసుకోండి.
శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై ఇప్పుడు భారీ డిస్కౌంట్ ఆఫర్లు నడుస్తున్నాయి. అమెజాన్‌లో ఈ ఫోన్2ను రూ. 19,690కే మీరు దక్కించుకోవచ్చు. ఈ ఫోన్ ఎంఆర్పీ రూ. 74,999. అంటే ఫోన్‌పై ఎంత భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉందో చూడండి.
శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ ఫోన్లో క్లౌడ్ మింట్, క్లౌడ్ నామీ కలర్ ఆప్షన్లలోని ఫోన్లపై భారీ డిస్కౌంట్ సేల్ నడుస్తుంది. ఈ ఫోన్ అమెజాన్‌లో రూ. 74,999 ధరకు లిస్ట్ అయ్యింది. కానీ ఆఫర్లోమీరు ఈ ఫోన్‌ను రూ. 32,990కు కొనుగోలు చేయొచ్చు. అంటే మీకు ఏకంగా 56 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే ఈ ఫోన్‌ను మరింత తక్కువ ధరకు పొందేందుకు కూడా వీలుంది. దీని కోసం మీ వద్ద పాత మొబైల్ ఫోన్ ఉంటే సరిపోతుంది. ఎక్స్చేంజ్ ఆఫర్లో మరింత తగ్గింపు లభిస్తుంది.
మీరు మీ పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకోవాలని భావిస్తే.. రూ. 13,300 వరకు ఎక్స్చేంజ్ తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ ఎక్స్చేంజ్ విలువ అనేది మీ ఫోన్, కండీషన్ ప్రాతిపదికన మారుతూ వస్తుంది. కొన్ని ఫోన్లకు తక్కువ రేటు కోట్ కావచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్‌తో మీకు 13,300 వరకు తగ్గింపు వస్తుంది. అంటే మీకు ఈ శాంసంగ్ 5జీ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 19,690కే లభించినట్లు. బ్యాంక్ ఆఫర్ కింద మరో రూ.1500 వరకు తగ్గింపు పొందొచ్చు. మీకు ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. 24 నెలలకుగాను ప్రతినెల రూ.1600 చెల్లించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు.
Read Also : Heroines : సోషల్ మీడియా ద్వారా సినిమాల కంటే ఎక్కువ సంపాదిస్తున్న బ్యూటీలు వీరే..
Read Also : Superstar Krishna AV : సూపర్ స్టార్ కృష్ణ ఎవి ని చుస్తే కన్నీళ్లు ఆగవు