Life Style : పెళ్లి అనేది ఎంత పవిత్రమైన బంధమో అందరికీ తెలుసు.. ఇక పెళ్లి అనేది మహిళలకు భిన్నంగా ఉంటుంది.. పెళ్లి తర్వాత పుట్టింటిని వదిలి అమ్మాయి అత్త వారింట్లో అడుగు పెడుతుంది.. మరి పెళ్లి అయిన మహిళలు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి.. వాటిని ఆచరించాలి.. అవి ఏంటో చూద్దాం..
పెళ్లి జరిగాక కొత్త ఇల్లు, కొత్త మనుషులు ఉంటారు.. వారితో మీరు ఎక్కువ సమయాన్ని గడిపితేనే వారిని అర్ధం చేసుకుని బంధాన్ని దృడంగా చేసుకోవచ్చు..
అలాగే పెళ్లి అయిన కూడా మహిళలు ఉద్యోగం వదలకూడదు.. మిమ్మల్ని ఆర్ధికంగా దృడంగా చేసుకోవాలంటే ఉద్యోగం మానకుండా చేయాల్సిందే.. ఇది మీకు వివిధ సమయాల్లో సహాయ పడుతుంది.
ఇంకా పెళ్లి తర్వాత మహిళలు వారి స్నేహితుల నుండి విడిపోతారు.. కానీ ఇది పెద్ద తప్పు.. దీనిని ఎప్పుడు చేయకూడదు.. మీ స్నేహితులతో టచ్ లో ఉంటేనే మీ భావాలను వారితో పంచుకోవచ్చు..
అలాగే మీ పెళ్లి రిజిస్ట్రేషన్ చాలా ముఖ్యం.. కాబట్టి ఇది మర్చిపోకుండా చేయించు కోవాలి. ఇది మీకు భవిష్యత్తులో అన్ని పనుల్లో అవసరం అవుతుంది..
ఇక పెళ్లి తర్వాత తల్లిదండ్రులకు ఫోన్ చేయలేక పోతారు. అలా కాకుండా మీరు ఉద్యోగం, ఇంటి పనులతో ఎంత బిజీగా ఉన్న సమయం దొరికినప్పుడల్లా రెండు నిముషాలు అయిన వారితో మాట్లాడండి..
అలాగే ఆర్ధిక విషయాలు కూడా మీ భర్తతో చర్చించడం మంచిది. బడ్జెట్ వేసుకుంటేనే ఆర్ధిక భారం నుండి తప్పించుకోవచ్చు.. ఈ విషయాలన్నీ పెళ్లి తర్వాత మహిళలు గుర్తు పెట్టుకుంటే మీరు కొన్ని కష్టాల నుండి బయట పడవచ్చు..
Read Also : SS Rajamouli : HIT 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జక్కన్న సందడి
Read Also : Tamannaah : పెండ్లికి రెడీ అయిపోయిన తమన్నా.. మెహందీ ఫంక్షన్ ఫొటోలు లీక్..!