What’s up Feature : వాట్సాప్.. ఇది సాధారణ ప్రజలకు సైతం తెలిసిన యాప్.. దీనిని ఇన్స్టంట్ మెసేజింగ్ ఫ్లాట్ ఫామ్ గా ఉపయోగిస్తారు.. మెటా యాజమాన్యం లోని ఈ వాట్సాప్ యాప్ ను అత్యధికంగా ప్రజలు వాడుతున్నారు.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ తో వినియోగదారులను కమ్యూనికేట్ చేసుకునేలా వాట్సాప్ చర్యలు తీసుకుంటుంది.
ఇక తాజాగా మరో ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాట్సాప్ వినియోగదారుల కోసం ప్రాక్సి సపోర్ట్ ను అందుబాటులోకి తెచ్చింది. కొన్ని సందర్భాల్లో ఇంటర్నెట్ షట్ డౌన్ ను చేస్తారు.. ప్రజల గొంతును అణచి వేసేందుకు ఇంటర్నెట్ షట్ డౌన్ ను ఉపయోగించిన సందర్బాలలో ఈ ఫీచర్ ఉపయోగ పడుతుంది.
ఇంటర్నెట్ షట్ డౌన్ సమయంలో కూడా వినియోగదారులు కమ్యూనికేట్ చేసుకునేలా వాట్సాప్ చర్యలు తీసుకుంది.. అందుకే ఈ ప్రాక్సీ సపోర్ట్ ను అందుబాటులోకి తెచ్చింది. ప్రాక్సీ సపోర్ట్ అంటే వినియోగదారులకు ప్రపంచ వ్యాప్తంగా వాలంటీర్లు, సంస్థలు ఏర్పాటు చేసిన సర్వర్ ద్వారా వాట్సాప్ కు కనెక్ట్ అయ్యే అవకాశం కలిపిస్తుంది..
ఇంటర్నెట్ సదుపాయం ఉంటే ప్రాక్సీ ని క్రియేట్ చేసిన ట్రస్టేట్ సోర్సెస్ కోసం సోషల్ మీడియా లేదా సెర్చ్ ఇంజిన్ ల ద్వారా సెర్చ్ చేయవచ్చు.. ప్రాక్సీ ద్వారా కనెక్ట్ అయ్యి జరిపే కన్వర్జేషన్ లకు కూడా వాట్సాప్ ప్రైవసీ ఉంటుంది.. చాట్స్ ట్యాబ్ లో మోర్ అప్షన్స్ లోకి వెళ్లి సెట్టింగ్స్ అప్షన్స్ పై క్లిక్ చేసి ప్రాక్సీ అడ్రెస్ ఎంటర్ చేస్తే సరి.. ఇలా కొత్త ఫీచర్ ను మీరు కూడా ఉపయోగించు కొండి..
Read Also : Disha Patani : స్టైలిష్ హాట్ లుక్స్‌తో కుర్రాళ్లను మాయ చేస్తున్న ప్రభాస్ హీరోయిన్ !
Read Also : Shraddha Das : లంగా వోణి లో తెగ ముద్దొస్తున్న టాలీవుడ్ ముద్దుగుమ్మ..!