Music Directors Remuneration: ఒక సినిమా విజయంలో హీరో హీరోయిన్ దర్శకుల పాత్ర ఎంతగా ఉంటుందో అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ల పాత్ర కూడా అంతే ఉంటుంది ఎందుకంటే ఆ సినిమాలో మంచి మ్యూజిక్ ఇచ్చి మంచి సాంగ్స్ కంపోజ్ చేయగలిగితే సినిమా రిలీజ్ కి ముందే జనాల్లోకి రీచ్ అవుతుంది సాంగ్స్ ని బట్టి సినిమా చూడడానికి జనాలు థియేటర్ కి వస్తారు అలాగే ఒక సిను ఎలివేట్ కావాలంటే దానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంతో అవసరం అందుకే సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ అనే వారి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ప్రస్తుతం తెలుగులో చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు అందులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు వారు ఒక సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనేది ఒకసారి చూద్దాం…
దేవి శ్రీ ప్రసాద్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న యువ కెరటం ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా దేవి శ్రీ ప్రసాద్ అని చెప్పాలి పెద్ద హీరోలు దగ్గర్నుంచి చిన్న హీరోల వారికి అందరి సినిమాలకి దేవిశ్రీ ప్రసాద్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకోవాలని చూస్తుంటారు అలాగే తన కెరీర్లో చాలా మ్యూజికల్ హిట్స్ కూడా ఇచ్చాడు దేవి శ్రీ ప్రసాద్ స్టార్ డైరెక్టర్ అయిన సుకుమార్ తన మొదటి సినిమా ఆర్య నుంచి ఇప్పుడొస్తున్న పుష్ప దాకా అన్ని సినిమాలకి దేవిశ్రీప్రసాదే మ్యూజిక్ డైరెక్టర్ అంటే మన అర్థం చేసుకోవచ్చు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఎలా ఉంటుందో అలాగే కొరటాల శివ సినిమాలో కూడా దేవిశ్రీప్రసాద్ ఎక్కువగా మ్యూజిక్ ఇస్తూ ఉంటాడు. అయితే ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ ఒక సినిమాకి మూడు కోట్ల వారికి తీసుకుంటున్నారని తెలుస్తుంది.
ఎం ఎం కీరవాణి
ఒకప్పుడు తెలుగులో అద్భుతమైన మ్యూజిక్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చాలా సినిమాలకు కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాడు వీరిద్దరి కాంబినేషన్ లో చాలా బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. అయితే కీరవాణి దర్శకధీరుడు రాజమౌళి కాంభినేషన్లో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి ప్రస్తుతం త్రిబుల్ ఆర్ సినిమా కి కూడా కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు కీరవాణి ఒక సినిమాకి 1.5 కోట్ల వరకు తీసుకుంటున్నాడని తెలుస్తోంది…
ఎస్.ఎస్.తమన్
తెలుగులో కిక్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చాడు తమన్ ఆ సినిమా మంచి విజయం సాధించడంతో తర్వాత అవకాశాలు వెల్లువలా వచ్చాయి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ప్రతి సినిమాలో తమదైన మార్క్ మ్యూజిక్ ని చూపిస్తూ జనాల్లో మంచి ఆదరణ పొందారు మధ్యలో కొన్ని రోజులు తమన్ మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేదు కానీ మళ్లీ అరవింద సమేత, అల వైకుంఠపురంలో, వకీల్ సాబ్ సినిమాలతో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్నాడు ప్రస్తుతం ఒక సినిమా కోసం 1 కోటి రూపాయల వరకు తీసుకుంటున్నారని తెలుస్తుంది.
మణి శర్మ
ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ అతన్ని మెలోడీ బ్రహ్మ అని కూడా పిలుస్తారు అయితే మధ్య లో కొన్ని రోజులు అవకాశాలు సరిగా రాలేదు దాంతో ఏ మాత్రం డిలా పడకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళాడు ఎప్పుడైతే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈస్మార్ట్ శంకర్ సినిమా వచ్చిందో అప్పటి నుంచి మళ్లీ మణి శర్మ తన ఫామ్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న ఆచార్య సినిమాకి కూడా తనే మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నాడు. ప్రస్తుతం మణి శర్మ 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు తీసుకుంటున్నాడు
అనిరుద్
వై దిస్ కొలవరి సాంగ్ తో చాలా పాపులర్ అయ్యాడు అనిరుద్. తెలుగులో అజ్ఞాతవాసి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశాడు తమిళంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అనిరుద్ కోటి నుంచి రెండు కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.