Pawan Kalyan : పవన్ కల్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా సినిమాలు చేస్తున్నారు. గతంలో కంటే చాలా స్పీడుగా సినిమాలను కంప్లీట్ చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. కాగా ఇప్పుడు ఆయన నటిస్తున్న సినిమాలను దగ్గరుండి చూసుకుంటున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. పవన్, త్రివిక్రమ్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్.
అందుకే పవన్ కు సంబంధించిన సినిమాల పనులను త్రివిక్రమ్ దగ్గరుండి మరీ చూసుకుంటారు. కాగా ఇప్పుడు త్రివిక్రమ్, మహేశ్ బాబు కాంబోలో ఓ సినిమా రాబోతోంది. ఈ మూవీకి SSMB28 అనే వర్కింగ్ టైటిల్ ను కూడా పెట్టేశారు. అయితే ఇక్కడే ఓ చిక్కు వచ్చి పడింది. అదేంటంటే.. ఈ మూవీని వచ్చే ఏడాది 2023 సంక్రాంతికి ప్లాన్ చేసుకున్నారు.
ఇప్పటికే జనవరి 13వ తేదీని లాక్ చేసి పెట్టుకున్నాడు త్రివిక్రమ్. అయితే ఇదే సంక్రాంతికి పవన్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాల్లో ఏదో ఒకటి సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉండేది. కానీ త్రివిక్రమ్ పవన్ సినిమాలను వాయిదా వేయించినట్టు తెలుస్తోంది. మహేశ్ మూవీకి కలెక్షన్లు తగ్గొద్దనే ఉద్దేశంతోనే త్రివిక్రమ్ ఇలా చేశారంట.
ఇక త్రివిక్రమ్ చెప్పడంతో పవన్ కూడా వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది. సంక్రాంతి సీజన్ అంటే ఎంత లేదన్నా రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబడుతాయి సినిమాలు. అంటే ఇలా మహేశ్ బాబు కోసం పవన్ రూ.200 కోట్లను వదులుకున్నారంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.
Read Also : Heroine : అతనితో ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్న హీరోయిన్.. ఇన్నాళ్లకు బయట పడింది..!
Read Also : Director Ramgopal Varma : ఆమెకు అన్నీ జారిపోయాయ్.. ఆమెతో రొమాన్స్ చేయలేదుః ఆర్జీవీ..