TTD Assets: తిరుమల శ్రీవారి ఆస్తుల విలువెంతో తెలుసా?

TTD Assets: ఏపీలోని తిరుమల శ్రీవారి ఆస్తుల వివరాలపై ఎప్పుడూ విమర్శలు వస్తుంటాయి. ఆస్తుల వివరాలు బయటపెట్టాలని పలువురు ప్రశ్నిస్తుంటారు..

By: jyothi

Published Date - Mon - 26 September 22

TTD Assets: తిరుమల శ్రీవారి ఆస్తుల విలువెంతో తెలుసా?

TTD Assets: ఏపీలోని తిరుమల శ్రీవారి ఆస్తుల వివరాలపై ఎప్పుడూ విమర్శలు వస్తుంటాయి. ఆస్తుల వివరాలు బయటపెట్టాలని పలువురు ప్రశ్నిస్తుంటారు. తాజాగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. దేశవ్యాప్తంగా టీటీడీకి 960 ఆస్తులు ఉన్నాయట.

దేశ వ్యాప్తంగా ఉన్న 960 ఆస్తుల విలువ సుమారు రూ.రూ.85,705 కోట్లు. ఇందులో దేశవ్యాప్తంగా సుమారు 7వేల ఎకరాల భూమితో పాటు, రూ.14వేల కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, 14 టన్నుల బంగారం ఉంది.

1974 నుంచి 2014 మధ్య కాలంలో టీటీడీకి చెందిన 114 ఆస్తులు అమ్ముడుపోయాయట. దీని తర్వాత ఒక్కటి అమ్ముడుపోలేదని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. గత ఐదు నెలల్లో విరాళాల ద్వారా టీటీడీకి నెలవారీ ఆదాయం పెరిగిన తరుణంలో ఈ విషయం వెల్లడైంది. టీటీడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు మొత్తం రూ. 700 కోట్ల ఆదాయం వచ్చింది.

Read Also : Payal Rajput : పాయ‌ల్ రాజ్ పుత్‌కు ఆ పిచ్చి.. అందుకే హీరోల‌ను న‌లిపేస్తోందా..?

Read Also :Anjali: ఆ మోజులో ప‌డి త‌ప్పుడు ప‌నులు చేసిన అంజ‌లి.. అందుకే కెరీర్ దొబ్బిందా..?

Read Today's Latest News News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News