Vani Bhojan : సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఈ భాష.. ఆ భాష అనే తేడాలు లేకుండా అన్ని ఇండస్ట్రీలలో ఇది పాతుకుపోయింది. ఈ జనరేషన్ లో ఇది చాలా ఎక్కువ అయిపోయిందని చెప్పుకోవాలి. ఇక మీటూ ఉద్యమం తెరమీదకు వచ్చిన తర్వాత చాలామంది దీనిపై స్పందిస్తున్న సంగతి తెలిసిందే కదా.
తాజాగా మరో హీరోయిన్ కూడా ఇలాగే స్పందించింది. ఆమె ఎవరో కాదు వాణి భోజన్. ఆమె రీసెంట్ గా తరుణ్ భాస్కర్ హీరోగా వచ్చిన మీకు మాత్రమే చెప్తా సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆమె తమిళంలో చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. ప్రస్తుతం బుల్లితెరపై పలు షలు చేస్తోంది ఈ భామ.
అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె మాట్లాడుతూ తన సినీ కష్టాలను వివరించింది. నేను కూడా మొదట్లో ఇబ్బందులు ఎదుర్కున్నాను. ఓ తమిళ నిర్మాతను అప్పట్లో ఛాన్సులు అడిగాను. దానికి ఆయన గెస్ట్ హౌస్ కు రమ్మని నీచంగా మాట్లాడాడు. నాకు చాలా చిరాకేసింది.
అలాంటి పని చేసి అవకాశాలు దక్కించుకోవాల్సిన ఖర్మ తనకు లేదని తెలిపింది వాని బోజన్. ఆ తర్వాత నాకు అలాంటి పరిస్థితులు ఎదురు కాలేదు. కేవలం నటనతోనే ఈ స్థాయికి చేరుకున్నాను. ఇప్పుడు మంచి ఆఫర్లు వస్తున్నాయి. ముందు ముందు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే కచ్చితంగా ఎదురిస్తా అంటూ తెలిపింది ఈ భామ.
Read Also : Sai Pallavi : అక్కడ చేతులు వేసి నొక్కాడు.. చేదు అనుభవం చెప్పిన సాయిపల్లవి..!
Read Also : Prabhas : టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అతనే.. సంచలనం రేపుతున్న ప్రముఖ సర్వే..!