Varalakshmi Sarathkumar Responded Casting Couch : సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనగానే అందరూ టక్కున ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వారికి మాత్రమే ఎదురవుతుందని అనుకుంటారు. కానీ బడా బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వరలక్ష్మీ శరత్ కుమార్ కు కూడా ఇది తప్పలేదు. ఈ విషయాలను స్వయంగా వరలక్ష్మీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం గమనార్హం.
ఆమె తండ్రి శరత్ కుమార్ ఒకప్పుడు సౌత్ ఇండియాలో స్టార్ హీరో. అంతే కాకుండా ఇప్పుడు బడా పొలిటీషియన్ కూడా. అంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వరలక్ష్మీ.. మొదట్లో హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించింది. కానీ పెద్దగా సక్సెస్ రాలేదు. దాంతో విలన్ పాత్రలు చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు తమిళ్, తెలుగులో పవర్ ఫుల్ విలన్ పాత్రలు చేస్తోంది.
ఇక గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాస్టింగ్ కౌచ్ పై ఓపెన్ అయింది. ఆమె మాట్లాడుతూ.. బ్యాక్ గ్రౌండ్ లేకుండా వస్తున్న వారికే కాస్టింగ్ కౌచ్ ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ నేను కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కున్నా. మొదట్లో కొందరు వ్యక్తులు హీరోల తరఫున నా వద్దకు వచ్చేవారు.
హీరోలతో పడుకుంటేనే ఛాన్సులు వస్తాయని చెప్పేవారు. నాకు పిచ్చ కపం వచ్చేది. వారిని చెడామడా తిట్టేసేదాన్ని. నిజంగా ఆ హీరోలు అడిగారో లేదో నాకు తెలియదు. కానీ అలా కొందరు నా వద్దకు వచ్చి అడగడంతో నిజమే కావచ్చు అనే అనుమానాలు మొదలయ్యాయి. కానీ అలాంటి వాటిని నేను అస్సలు ఎంకరేజ్ చేయను అంటూ చెప్పుకొచ్చింది వరలక్ష్మీ. అయితే ఆ హీరోలు ఎవరనేది మాత్రం ఆమె చెప్పలేదు.