Varun Tej : చాలాకాలంగా వస్తున్న వార్తలను తాజాగా కన్ఫర్మ్ చేసింది మెగా ఫ్యామిలీ. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి హీరోయిన్ లావణ్య త్రిపాఠితో చేయడానికి ఒప్పుకుంది. గత కొన్ని రోజులుగా వీరిద్దరి ఎంగేజ్ మెంట్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. కానీ అటు మెగా ఫ్యామిలీ గానీ, ఇటు లావణ్య గానీ అస్సలు స్పందించలేదు.
కానీ తాజాగా వీరిద్దరి ఎంగేజ్ మెంట్ ను అధికారికంగా ప్రకటించారు. రేపు వీరి ఎంగేజ్ మెంట్ ఉంటుందంట. అయితే మెగా ఫ్యామిలీలో ఇంత పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంటే అందరూ సైలెంట్ గా ఉండిపోయారు. ఇదే ఇప్పుడు అనేక అనుమానాలకు దారి తీస్తోంది. వాస్తవంగా చూస్తుంటే మెగా కోడలిగా ఓ హీరోయిన్ ను చేసుకోవడం మెగా ఫ్యామిలీకి అస్సలు ఇష్టం లేదంట.
గతంలో చిరంజీవి, రామ్ చరణ్ విషయంలో కూడా కండీషన్ ఉంది. వారు హీరోయిన్లను చేసుకోలేదు కాబట్టే సంతోషంగా ఉన్నారు. కానీ పవన్ మాత్రం మెగా రూల్ దాటి హీరోయిన్లను పెండ్లి చేసుకున్నాడు. అందుకే ఆయనకు విడాకులు అయ్యాయి. ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా అలాంటి ఇబ్బంది పడొద్దనే కారణంతో మెగా ఫ్యామిలీ చాలా నచ్చజెప్పినట్టు సమాచారం.
కానీ వరుణ్ మాత్రం లావణ్యను వదులుకోవట్లేదు. దాంతో ఇష్టం లేకపోయినా మెగా ఫ్యామిలీ ఒప్పుకుందంట. కానీ రేపు ఎంగేజ్ మెంట్ పెట్టుకుని కూడా అంతా మౌనంగా ఉన్నారు. అదే నిహారిక విషయంలో మాత్రం ఎంగేజ్ మెంట్ కు ముందే నానా హంగామా చేశారు. అధికారికంగా నాగబాబే స్వయంగా ప్రకటించారు. కానీ వరుణ్ విషయంలో మాత్రం మౌనంగా ఉండటాన్ని బట్టి చూస్తుంటే ఈ పెండ్లి వారికి మనస్పూర్తిగా ఇష్టం లేదని అర్థం అవుతోంది.
Read Also : Sri Reddy : ఆ హీరో లుంగీ కట్టుకుని నా రూమ్ కు వచ్చాడు.. శ్రీరెడ్డి మరో సంచలనం..!
Read Also : Ashu Reddy : పెళ్లికి ముందు డేటింగ్ చేస్తేనే బెటర్.. అషురెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!