Vidya Balan : విద్యాబాలన్ అంటే దేశ వ్యాప్తంగా అందరికీ తెలుసు. డర్టీ పిక్చర్స్ సినిమాతో ఒక్కసారిగా ఇండియా వ్యాప్తంగా ఆమె సెన్సేషన్ అయిపోయింది. ఇందులో సిల్క్ స్మిత పాత్రలో ఆమె అదరగొట్టేసింది. చాలా బోల్డ్ గా నటించి మెప్పించింది ఈ భామ. అంతకు ముందే చాలా సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసింది.
కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విద్యాబాలన్ సంచలన ఆరోపణలు చేసింది. నేను మొదట్లో సినిమాల్లోకి వెళ్తానని చెప్పినప్పుడు మా అమ్మానాన్నలు భయపడ్డారు. నన్ను సినిమాల్లోకి వద్దని చెప్పారు. వారు భయపెట్టినట్టే నాకే ఓ ఘటన ఎదురైంది. ఓ డైరెక్టర్ తో సినిమా గురించి మాట్లాడేందుకు నేను కాఫీ షాప్ కు వెళ్లాను.
అతను కథ చెబుతుండగా మధ్యలో రూమ్ కు వెళ్లి మాట్లాడుకుందాం అన్నాడు. అతని మాటలు నమ్మి నేను అతనితో రూమ్ కు వెళ్లాను. అక్కడకు వెళ్లాక అతని ఇన్ టెన్షన్ నాకు అర్థం అయింది. అందుకే డోర్స్ ఓపెన్ చేసి ఉంచాను. దాంతో అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. కొద్ది సేపు అసభ్యకరంగా ప్రవర్తించాడు.
దాంతో నాకు కోపం వచ్చి అక్కడి నుంచి లేచి వచ్చేశాను. ఆ తర్వాత నాకు మళ్లీ అలాంటి సంఘటన ఎదురుకాలేదు. ఇప్పటి వరకు బాగానే ఉన్నా అంటూ వివరించింది ఈ భామ. ఆమె చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచనలం రేపుతున్నాయి. మరి ఆమె కామెంంట్లపై మీ అభిప్రాయం కూడా తెలియజేయండి.
Read Also : Bigg Boss Sarayu : నేను వర్జిన్ కాదు.. అతనితో ఏడేళ్లు సహజీవనం చేశా.. బిగ్ బాస్ సరయు..!
Read Also : Karate Kalyani : నేను పైట జారిస్తే సొల్లు కారుస్తారు.. కరాటే కల్యాణి షాకింగ్ కామెంట్లు..!