Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇప్పుడున్న స్టార్ హీరోల్లో ఓ సెన్సేషన్. అమ్మాయిలకు కలల రాకుమారుడు. కేవలం అమ్మాయిలే కాదు స్టార్ హీరోయిన్లు, బాలీవుడ్ భామలు కూడా ఒక్కరోజైనా అతనితో డేటింగ్ చేస్తే చాలు అనుకునే రేంజ్ కు ఎదిగాడు ఈ యంగ్ డైనమిక్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ హీరో స్టేటస్ ను సంపాదించుకున్నాడు.
స్టార్ హీరోల కొడుకులకు కూడా సాధ్యం కాని స్టార్ ఇమేజ్ ను ఆయన సంపాదించుకున్నాడంటే మాటలు కాదు. అయితే విజయ్ దేవరకొండ అంటే ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు కానీ.. ఆయన గతంలో వేరే అవ్వాలని అనుకున్నాడంట. ఈ విషయాలను ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
గతంలో ఓ ప్రోగ్రామ్ లో ఆయన రాపిడ్ ఫైర్ గేమ్ ను ఆడారు. ఈక్రమంలోనే మీరు పెద్దయ్యాక ఏమవ్వాలని అనుకున్నారు అని అడగ్గా.. నేను బస్ కండక్టర్ ను అవ్వాలని అనుకున్నాను. కానీ అనుకోకుండా పెద్దయ్యాక హీరో అయ్యాను అంటూ ఫన్నీగా ఆన్సర్ చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ.
ఇక విజయ్ తండ్రి సీరియల్స్ కు డైరెక్టర్ గా పని చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ విధంగానే ఆయనకు సినిమాలపై ఇంట్రెస్ట్ కలిగి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇక నేడు ఆయన 34వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆశించిన స్థాయికి ఎదగాలిన మనం కూడా కోరుకుందాం.
Read Also : Samantha : సమంతలో అది నాకు చాలా ఇష్టం.. అందుకే పెళ్లి చేసుకున్నాః నాగచైతన్య
Read Also : Anchor Sreemukhi : శ్రీముఖి కెరీర్ ను నాశనం చేయాలని చూసిన డైరెక్టర్.. అంత పని చేశాడా..?