Vijayashanthi : సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి-విజయశాంతికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. హీరోల్లో చిరు నెంబర్ వన్ అయితే.. హీరోయిన్లలో విజయశాంతి నెంబర్ వన్. అప్పట్లో హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్ గా విజయశాంతికి పేరుంది. వీరిద్దరి కాంబోలో ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో 90 శాతం సూపర్ హిట్ సినిమాలే.
కాగా సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే విజయశాంతి తన కెరీర్ ను త్యాగం చేసి రాజకీయాల్లోకి వచ్చేసింది. తెలంగాణ తరఫున పార్టీ పెట్టి పోరాటం చేసింది. ఆ సమయంలోనే ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చిరు మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ కోసం తెలంగాణ ప్రజలు ఎంతో చేశారు.
కానీ ఈరోజు తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవరూ మాట్లాడట్లేదు. చిరంజీవి కూడా పార్టీ పెట్టారు. కానీ తెలంగాణ గురించి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ఆయన ముసుగు దొంగగా మారిపోయాడు. ఆయనే కాదు చాలా మంది అలాగే ఉన్నారు. ఎవ్వరూ కూడా తెలంగాణ కోసం మాట్లాడట్లేదు.
సినిమా స్టార్లు తెలంగాణకు అన్యాయం జరిగినా నోరు మెదపట్లేదు అంటూ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేసింది. కానీ విజయశాంతి వ్యాఖ్యలపై చిరు మాట్లాడలేదు. ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుని ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నారు. కానీ విజయశాంతి మాత్రం రాజకీయాల్లోనే బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నారు.
Read Also : Kasthuri Shankar : ఆ తెలుగు హీరో తాగి నా రూమ్ కు వచ్చాడు.. నటి కస్తూరి కామెంట్లు వైరల్…!
Read Also : Chiranjeevi : శరత్ బాబు హీరోగా, చిరంజీవి విలన్ గా నటించిన మూవీ ఏదో తెలుసా..?