Vishnu Priya : యాంకర్ విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె తెలుగులో పాపులర్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఎందుకో కెరీర్ ను నిలబెట్టుకోలేకపోయింది. ఇప్పుడు బుల్లితెరపై పెద్దగా కనిపించట్లేదు. పోవేపోరా షో తర్వాత ఆమె మరో షోలో యాంకరిగ్ మాత్రం చేయలేకపోయింది. ఇంకా చెప్పాలంటే ఆమెకు అవకాశాలు రాలేదు.
ఇదిలా ఉండగా ఆమె ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. అదే సమయంలో కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ లో కూడా చేస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ మానస్ తో కలిసి రెండు పాటల్లో నటించింది. రీసెంట్ గానే ఆమె తల్లి చనిపోయింది. కానీ ఇప్పుడిప్పుడే ఆమె ఆ బాధ నుంచి తేరుకుంటోంది.
ఇదిలా ఉండగా ఆమె తన క్రష్ ఎవరు అంటే మాత్రం టక్కున అక్కినేని అఖిల్ అని ఎన్నో సార్లు చెప్పేసింది. ఇదే విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో కూడా ఆమె చెప్పింది. ఆమె మాట్లాడుతూ.. నాకు అఖిల్ అంటే చాలా ఇష్టం. వీలు కుదిరితే అతనితో సినిమాలో నటించాలని ఎంతో ఆశగా ఉన్నాను.
కుదిరితే అదే సినిమాలో ఆయనకు లిప్ లాక్ ఇవ్వడానికి కూడా నేను రెడీ అంటూ బోల్డ్ కామెంట్లు చేసింది విష్ణుప్రియ. ఆమె చేసిన కామెంట్లపై నెటిజన్లు వల్గర్ కామెంట్లు పెడుతున్నారు. మరి అంతా ఆత్రుతుగా ఉన్నావా.. ఆగలేకపోతున్నావా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Read Also : Karate Kalyani : ఐదు నిముషాల సుఖం కోసం కక్కుర్తి పడొద్దు.. నటి కరాటే కల్యాణి సంచలన కామెంట్లు..!
Read Also : SS Rajamouli : రాజమౌళి డైరెక్షన్ ను డామినేట్ చేసి పేరు తెచ్చుకున్న హీరో ఎవరో తెలుసా..?