Vishnu Priya : సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ రాణించడం అనేది అందరికీ ఒక కల. కానీ అది కేవలం కొందరికి మాత్రమే సాధ్యం అవుతుంది. అయితే ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలలో ఓ పెనుభూతం ఉంది. దాని పేరు కాస్టింగ్ కౌచ్. దీన్ని ఎదుర్కుని చాలామంది నిలబడ్డారు. కానీ కొందరు మాత్రం దానికి బలైపోయారు.
కాస్టింగ్ కౌచ్ పేరుతో కొందరు ఉద్యమాలు కూడా చేశారు. ఇక మీటూ ఉద్యమం తర్వాత చాలామంది బయటకు వచ్చి తమకు జరిగిన అనుభవాలను పంచుకున్నారు. ఇప్పుడు తాజాగా యాంకర్ విష్ణుప్రియ కూడా ఈ దారిలోకి వచ్చేసింది.విష్ణుప్రియ యాంకర్ కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ గా చేసే స్థాయికి ఎదిగింది.
అప్పుడప్పుడు ప్రైవేట్ ఆల్బమ్స్ లో కూడా నటిస్తోంది ఈ భామ. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. కాస్టింగ్ కౌచ్ మీద స్పందించింది. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. నేను కూడా దాన్ని ఎదుర్కున్నాను.
మొదట్లో సినిమాల్లో ఛాన్సుల కోసం ప్రయత్నించినప్పుడు ఓ డైరెక్టర్ నన్ను రూమ్ కు ఇన్ వైట్ చేశాడు. మూవీ గురించి డిస్కస్ చేయాలి రా అని పిలిచాడు. కానీ నాకు అనుమానం వచ్చి వెళ్లలేదు. అప్పటి నుంచి ఎవరూ నన్ను ఇబ్బందిపెట్టలేదు. నాకు వచ్చిన ఛాన్సులతోనే ముందుకు వెళ్తున్నా అంటూ తెలిపింది విష్ణుప్రియ.
Read Also : Director Sukumar : సాయిపల్లవిని నిండా ముంచేసిన సుకుమార్.. ఎంత పని చేశావయ్యా..?
Read Also : Deepika Padukone : అవి పెంచుకోమని చెత్త సలహా ఇచ్చారు.. దీపికా పదుకొనె సంచలన కామెంట్లు..!