VK Naresh : టాలీవుడ్ లో జల్సా కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు వీకే నరేశ్. ఈయన గతంలో హీరోగా చేసినా.. సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం నటుడిగా బాగా సక్సెస్ అయ్యాడు. హీరోగా కంటే కూడా నటుడిగానే ఆయన కెరీర్ బాగుంది. విజయ నిర్మలకు ఆయన ఏకైక వారసుడు. అంతే కాకుండా ఆయన స్టెప్ ఫాదర్ కృష్ణ నుంచి కూడా బాగానే ఆయనకు ఆస్తులు వచ్చాయంట.
కెరీర్ పరంగా ఎలాంటి ఢోకా లేకపోయినా.. వ్యక్తిగతంగా మాత్రం ఆయన ఇబ్బందులు పడుతున్నారు. ఆయనకు ఇప్పటికే మూడు పెండ్లిలు అయ్యాయి. అందులో ఇద్దరితో విడాకులు అయ్యాయి. కానీ మూడో భార్య రమ్యతో విబేధాలు నడుస్తున్నాయి. ఇక ఆయన అరవై ఏండ్ల వయసులో ఇప్పుడు పవిత్ర లోకేష్ తో డేటింగ్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
వీరిద్దరి యవ్వారం ఎంత దుమారం రేపుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. త్వరలోనే పవిత్రను నాలుగో పెండ్లి చేసుకోవాలని నరేశ్ డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి మళ్లీపెళ్లి అనే సినిమాలో నటించారు. ఇది నరేశ్ యదార్థ జీవితం ఆధారంగా తీసినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ట్రైలర్ లో నరేశ్ అసిస్టెంట్ ఓ డైలాగ్ చెబుతాడు.
మీకేంటి సార్ వెయ్యి కోట్ల ఫిగర్ మీరు అని అంటాడు. నరేశ్ ఆస్తుల విలువను క్యాలిక్యులేట్ చేసి ఈ డైలాగ్ రాసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే విజయ్ నిర్మల, కృష్ణ నుంచి వచ్చిన ఆస్తులు మొత్తం కలిపితే నరేశ్ ఆస్తులు వెయ్యికోట్లకు పైగానే ఉంటాయంట. ఈ విషయం తెలుసుకుని నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Read Also : Anchor Jhansi : జగపతి బాబుతో ఎఫైర్ అంటగట్టారు.. యాంకర్ ఝాన్సీ ఫైర్..!
Read Also : Custody Movie : ప్లాప్ మూవీ కస్టడీని రిజెక్ట్ చేసిన లక్కీ హీరోయిన్ ఎవరో తెలుసా..?