Whatsup: వాట్సాప్ దండగ.. సిగ్నల్, టెలిగ్రాం ఉండగా..

Whatsup: ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఆఫీస్ కొలీగ్స్ తదితరులతో కమ్యూనికేషన్ కోసం ఇన్నాళ్లూ వాట్సాప్ ని బాగా వాడినవాళ్లు ఇప్పుడు వేరే యాప్ లపై ఫోకస్ పెడుతున్నారు. ఎక్కువ మంది.. సిగ్నల్, టెలిగ్రాం వంటి వాటిని వాడుతున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా కొత్తగా ఆ రెండు యాప్ లను ఇన్ స్టాల్ చేసుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఫలితంగా వాట్సాప్ ని డౌన్ లోడ్, ఇన్ స్టాల్ చేసుకునేవారి సంఖ్య ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో ఏకంగా […].

By: jyothi

Published Date - Mon - 17 May 21

Whatsup: వాట్సాప్ దండగ.. సిగ్నల్, టెలిగ్రాం ఉండగా..

Whatsup: ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఆఫీస్ కొలీగ్స్ తదితరులతో కమ్యూనికేషన్ కోసం ఇన్నాళ్లూ వాట్సాప్ ని బాగా వాడినవాళ్లు ఇప్పుడు వేరే యాప్ లపై ఫోకస్ పెడుతున్నారు. ఎక్కువ మంది.. సిగ్నల్, టెలిగ్రాం వంటి వాటిని వాడుతున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా కొత్తగా ఆ రెండు యాప్ లను ఇన్ స్టాల్ చేసుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఫలితంగా వాట్సాప్ ని డౌన్ లోడ్, ఇన్ స్టాల్ చేసుకునేవారి సంఖ్య ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో ఏకంగా 43 శాతం పడిపోయింది. ఈ విషయాన్ని సెన్సార్ టవర్ అనే అనలిటిక్స్ సంస్థ తన రిపోర్ట్ లో పేర్కొంది.

ఎందుకిలా?..

వాట్సాప్ కొత్తగా ఒక ప్రైవసీ పాలసీని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. దాని ప్రకారం వాట్సాప్ తన యూజర్ల ఇన్ఫర్మేషన్ ని కొంత వరకు తన పేరెంట్ కంపెనీ ఫేస్ బుక్ తో షేర్ చేసుకుంటుంది. ఈ కండిషన్ కి ఈ (మే) నెల 15వ తేదీ లోపు ఒప్పుకోవాల్సిందే అని డెడ్ లైన్ కూడా పెట్టింది. ఈ సంగతిని ఇండియాలోని వాట్సాప్ ప్రతినిధులు ఢిల్లీ హైకోర్టుకు చెప్పారు. కొత్త పాలసీకి యూజర్లు ఓకే చెప్పకపోతే వాళ్ల అకౌంట్లను వాట్సాప్ క్రమంగా తొలగిస్తుందని సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్ చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్ లతో కూడిన ధర్మాసనానికి తెలిపినట్లు వార్తలొచ్చాయి. దీంతో చాలా మంది కస్టమర్లు వాట్సాప్ కి గుడ్ బై చెబుతున్నట్లు లేటెస్ట్ డెవలప్మెంట్స్ ని బట్టి అర్థమవుతోంది.

అయినా.. అదే లీడర్..

వాట్సాప్ ఇన్ స్టాలేషన్లు ఈ ఏడాది ఇప్పటికే 40 శాతం పడిపోయినప్పటికీ మార్కెట్ లీడర్ గా అదే కొనసాగుతోందని సెన్సార్ టవర్ రిపోర్ట్ తేల్చిచెప్పింది. ఎందుకంటే వాట్సాప్ ఇన్ స్టాల్స్ మొత్తం సంఖ్య ప్రస్తుతం సుమారు 17 కోట్ల 23 లక్షలంటోంది. టెలిగ్రాం ఇన్ స్టాలేషన్స్ ఇయర్-ఓవర్-ఇయర్ బేసిస్ లో 98 శాతం పెరిగాయి. దీంతో మొత్తం ఇన్ స్టాల్స్ సంఖ్య కోటీ 60 లక్షలకి పైగా నమోదైంది. ఇక, సిగ్నల్ యాప్ ఫస్ట్ టైమ్ డౌన్ లోడ్లు ఎవరూ ఊహించని రీతిలో 1,192 శాతం పెరిగాయి. దీంతో మొత్తం డౌన్ లోడ్ల సంఖ్య 6 కోట్ల 46 లక్షలను దాటింది.

 

Latest News

Related News