Rudraksha: ఎవరు ఏ రుద్రాక్ష ధరిస్తే మంచిదో మీకు తెలుసా ?

Rudraksha: రుద్రాక్ష.. అంటే తెలియని హిందువులు ఉండరు. చాలామంది భక్తులు రుద్రాక్షలను ధరిస్తుంటారు. ఇవి సాక్షాత్తు శివాంశగా పేర్కొంటారు. అయితే చాలామందికి తెలియనిది ఎవరు ఏ రుద్రాక్ష ధరించాలి. దానివల్ల వారకి కలిగే ప్రయోజనాలు ఏమిటి? ప్రస్తుతం ఏ పేరు ఉన్నవారు ఏ రుద్రాక్షను ధరించాలో తెలుసుకుందాం….పంచాంగం ప్రకారం ప్రధానంగా మనకు 27 నక్షత్రాలు ముఖ్యమైనవి. వాటి ప్రకారం 12 రాశులు. ఈ నక్షత్రాల ప్రకారం ఒక్కో నక్షత్రం నాలుగుపాదాలు. వాటిని బట్టి పేర్లు పెట్టుకుంటాం వాటి […].

By: jyothi

Updated On - Sun - 16 May 21

Rudraksha: ఎవరు ఏ రుద్రాక్ష ధరిస్తే మంచిదో మీకు తెలుసా ?

Rudraksha: రుద్రాక్ష.. అంటే తెలియని హిందువులు ఉండరు. చాలామంది భక్తులు రుద్రాక్షలను ధరిస్తుంటారు. ఇవి సాక్షాత్తు శివాంశగా పేర్కొంటారు. అయితే చాలామందికి తెలియనిది ఎవరు ఏ రుద్రాక్ష ధరించాలి. దానివల్ల వారకి కలిగే ప్రయోజనాలు ఏమిటి? ప్రస్తుతం ఏ పేరు ఉన్నవారు ఏ రుద్రాక్షను ధరించాలో తెలుసుకుందాం….పంచాంగం ప్రకారం ప్రధానంగా మనకు 27 నక్షత్రాలు ముఖ్యమైనవి. వాటి ప్రకారం 12 రాశులు. ఈ నక్షత్రాల ప్రకారం ఒక్కో నక్షత్రం నాలుగుపాదాలు. వాటిని బట్టి పేర్లు పెట్టుకుంటాం వాటి ప్రకారం…

Rudraksha:

Rudraksha:

అశ్విని నక్షత్రం మొదలు రేవతి వరకు పరిశీలిస్తే… చూ,చే,చో,ల,లీ,లూ,లే,లో ప్రథమ నామాక్షరాలు ఉన్న వారు మూడుముఖాల రుద్రాక్ష గాని,”1″,”3″,”5″ముఖాలు కలిగిన రుద్రాక్షలను కవచంలాగ థరించవచ్చును. కా,కి,కూ,ఖం,ఙ,ఛ,కే,కో,హా ప్రథమ నామాక్షరలు ఉన్న వారు నాలుగు ముఖాల రుధ్రాక్ష గాని,”4′,”6″,”7″,ముఖాలు కలిగిన రుధ్రాక్షలు కవచం లాగ గాని థరించ వచ్చును . మా,మీ,మూ,మే,మో,టా,టి,టు,టే ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి, ఏకముఖి గాని, “1”,”3″,”5″, ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ థరించ వచ్చును.

ఇక ‘‘ఈ,ఊ,ఏ,ఓ,వా,వీ,వు,వే,వో’’ ప్రథమ నామాక్షరాలు ఉన్న వారు ఆరు ముఖాల రుధ్రాక్ష గాని, “4”,”6″,”7″ ముఖాలు కలిగిన రుధ్రాక్షలు థరించాలి. హి,హు,హె,హూ,డా,డి,డూ,డే,డో, ప్రథమ నామాక్ష్రాలు ఉన్న వారు ద్విముఖి రుధ్రాక్ష గాని ,”2″,”3″,”5″, ముఖాలు కలిగిన రుధ్రాక్షలు కవచంలాగ గాని ధరించ వచ్చును. రా,రి,రూ,రె,రో,తా,తీ,తూ,తే, ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి, తులా లగ్నం వారికి, తులారాశి వారికి, భరణి, పుబ్బ, పూర్వషాడ, నక్షత్రాల వారికి”6″ముఖాల రుధ్రాక్ష గాని ,”4′,’6″,”7″ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచంలాగ థరించ వచ్చును.

టో,పా,పి,పూ,ష,ణ,ఢ,పె,పో ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి, కన్య లగ్నం వారికి,రాశి వారికి ,ఆశ్లేష,జ్యేష్ట, రేవతి,నక్షత్రాల వారికి “4”ముఖాల రుధ్రాక్ష గాని,”4″,”6″,”7″,ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ థరించ వచ్చును. తో,నా,నీ,నూ,నే,నో,య,యి,యు, ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికిమూడు ముఖాల రుధ్రాక్ష గాని,”2″,”3″,”5″ముఖాల రుధ్రాక్షలను కవచంలాగ థరించ వచ్చును. యే,యో,బా,బి,బు,ధ,భ,ఢ,బే,ప్రథమ నామాక్షరాలు ఉన్న వారు పంచముఖి రుధ్రాక్ష గాని “1”,’3″,”5″ముఖాల రుధ్రక్షలను కవచం లాగ థరించ వచ్చును.

బో,జా,జి,జు,జే,జో,ఖా,గ,గి,ప్రథమ నామాక్షరాలు ఉన్న వారు సప్తముఖి రుధ్రాక్ష గాని,”4″,”6″,”7″,ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ థరించాలి. గూ,గే,గో,సా,సి,సు,సే,సో,దా ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి, కుంభ సప్తముఖాల రుధ్రాక్ష గాని,”4″,”6″,”7″ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ థరించాలి. ద, దు,శ్యం,ఝ,ద,దే,దో, చా,చి, నామాక్షరాలు ఉన్న వారికి, పంచముఖాల రుధ్రాక్ష ని,”2″,”3″,”5″రుధ్రాక్షలను కవచం లాగ ధరించాలి. పైన చెప్పినట్లుగా ఆయా రుద్రాక్షలను వాడితే మంచి ఫలితాలు వస్తాయి.

రుద్రాక్షలను వాడేటప్పుడు తప్పక పండితులు లేదా జ్యోతిష్లు సూచనలు తీసుకుని వాటని పాటించాలి. వాటిని పరమ పవిత్రమైన వాటిగా భావించి వాటని ధరించినప్పుడు శుచి, శుభ్రత, ధర్మం, సత్యాన్ని పాటించాలి. అపుడే అవి మనకు తగిన ఫలితాలను ఇస్తాయి.

Read Today's Latest Devotional News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Tags

Latest News

Related News