Twins కవల పిల్లలు పుట్టడం చాలా అరుదు. చాలా రేర్ కూడా. ప్రపంచంలో చాలా మంది కవల పిల్లలు ఉన్నారు. వారి కోసం ప్రత్యేకంగా ఒక రోజును సైతం సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రోజు కేవలం వారి కోసమే. కవల పిల్లలు పుట్టడం చాలా అరుదైన విషయం. కానీ ఒక గ్రామంలో మాత్రం కవల పిల్లలకు ఫేమస్. ఆ గ్రామంలో మాములు జనాల కంటే కవలపిల్లలే ఎక్కువ. ఇంతకీ ఏంటా ఊరు.. అది ఎక్కడ ఉంది అని తెలుసుకోవాలి అనుకుంటున్నారా..? మరి ఇంకెందుకు ఆలస్యం తెలుసుకుందాం పదండి..
ప్రపంచంలో వింతలు చాలా ఉన్నాయి. ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు సైతం చాలానే ఉన్నాయి. అయితే.. దేశాలకు, ప్రాంతాలకు, గ్రామాలకు సైతం ఒక్కో విధమైన స్పెషాలిటీ ఉంటుంది. దేని స్పెషాలిటీ దానిదే. అయితే.. ప్రస్తుతం ఓ గ్రామానికి సంబంధించిన స్పెషాలిటీ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అదేంటో తెలిస్తే మీరు షాకవ్వడంతో పాటు ఆశ్చర్యం సైతం వ్యక్తం చేస్తారు. మామూలుగా జనాల కంటే కవలకు ఎక్కువ అట్రాక్షన్ అవుతుంటారు. ఎందుకంటే ఇలాంటి వారు కనిపించడం చాలా అరుదు. కానీ ఒక గ్రామంలో ప్రతి మూడో ఇంట్లో కవలలే. ఈ గ్రామంలో ఒక ద్వీపంలో ఉంది అదే ఫిలిప్పీన్స్. ఈ ద్వీపంలోని ఆ గ్రామం గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ గ్రామం ప్రకృతి అందాలకు, చేపలు పట్టేందుకు చాలా ఫేమస్ అంటున్నారు కొందరు.
ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ ప్రకారం ఆ ద్వీపంలోని ఓ విలేజ్ లో 15వేల మంది నివసిస్తున్నారు. వారిలో దాదాపుగా చాలా మంది (సుమారు 100 జతలు) కవలలే ఉన్నారట. ఇంతకంటే ఆశ్చర్యమైన విషయము ఏమిటంటే.. ఆ విలేజ్ లో ఇంతలా కవలలు ఉన్నారని ఎవరికీ తెలియదట. ఇక్కడి ప్రజలకు మాత్రమే ఇంతలా కవల పిల్లలు ఎలా పుడుతున్నారో తెలుసుకునేందుకు ఎవరూ పరిశోధనలు సైతం చేయలేదు. కానీ ఇక్కడి స్థానికులు మాత్రం ఓ విషయాన్ని చెబుతున్నారు. ఇక్కడి మహిళలు సంతాన ఉత్పత్తిని పెంచేందుకు ప్రత్యేక మందులను ఉపయోగించారని టాక్. దీని వల్ల 1996 నుంచి 2006 వరకు 35 ఏండ్ల మహిళల్లో కవల గర్భాలు 182 శాతం పెరిగాయని చెబుతున్నారు. చాలా వింతగా ఉంది కదా.. మరి ఇలాంటి వాటిపై పరిశోధనలు జరిగితే కవల పిల్లలు ఎక్కువగా పుడుతున్నందుకు గల కారణాలు బయటి ప్రపంచానికి తెలియడంతో పాటు.. ఆ గ్రామం సైతం ఫేమస్ అవుతుంది. మరి భవిష్యత్తులోనైనా ఇందుకు ఎవరైనా ముందుకు వస్తారో లేదో వేచి చూడాలి.