ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన కమెడియన్ అలీ తాజాగా రాజమండ్రిలో జరిగిన ఒక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి హాజరయ్యాడు.
ఆ సందర్భంగా మీడియా వారు ఆయనను వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుండి పోటీ చేయబోతున్నారు అంటూ ప్రశ్నించగా పార్టీ అధిష్టానం ఆదేశాల అనుసారం నడుచుకుంటానని పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుండి పోటీ చేయమంటే అక్కడి నుండి పోటీ చేసేందుకు సిద్ధం అంటూ అని పేర్కొన్నాడు.
గత ఎన్నికల సమయంలో ఆలీ వైకాపా లో జాయిన్ అయ్యాడు.. ఆ సమయంలోనే అలీకి సీట్ వస్తుందని అంతా భావించారు. కానీ ఆ సమయంలో జగన్ మొండి చేయి చూపించడంతో ఈసారి అలీ చాలా ఆశలు పెట్టుకున్నాడు.
రాజమండ్రి పార్లమెంటు స్థానం కోసం అలీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. పైకి మాత్రం పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు తన పోటీ ఉంటుందని చెబుతున్నాడు.