Balakrishna: ఏపీలో ఎన్టీఆర్ యూనివర్సిటీకి పేరు మార్పుపై నందమూరి అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. తెలుగుజాతి గర్వించేలా చేసిన మహనీయుని పేరు మార్చి ఎందుకు వైఎస్సార్ పేరు పెడుతున్నారని ప్రజలు కూడా జగన్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇదే విషయంపై వైఎస్ షర్మిల కూడా తన సోదరుడు, సీఎం జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఇక నందమూరి బాలయ్య బాబు, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా పేరు మార్పును తప్పుబట్టారు.
జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్రంగా మండిపడుతున్నారు. తన ఫేస్బుక్ పేజీలో బాలకృష్ణ రాసుకొచ్చిన కామెంట్ వైరల్ అవుతోంది. ఇది పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్‌కు తాకేలా పెట్టినట్టు పలువురు చర్చించుకుంటున్నారు. ‘ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో చాలామంది నేతలు, పీతలు బతుకుతున్నారు. విశ్వాసం లేని వారిని చూసి కుక్కలు సైతం వెక్కిరిస్తున్నాయి. శునకాల ముందు తలవంచుకు.. సిగ్గు లేని బతుకు బతకడం ఎందుకు’.. అంటూ బాలకృష్ణ ఫైర్ అయ్యారు.
ఇందులో ఎన్టీఆర్ పెట్టిన భిక్షతో బతుకుతున్న వారు ఎవరంటే కొడాలినాని, వల్లభనేని వంశీ.. వీరిద్దరూ గతంలో టీడీపీ పార్టీలోనే ఉన్నారు. కొడాలి నాని గత ఎన్నికల కంటే ముందే వైసీపీలో చేరితే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి వైసీపీ అనుకూలంగా మాట్లాడటం ప్రారంభించారు. అయితే, వీరిద్దరూ జూనియర్ ఎన్టీఆర్‌కు మంచి మిత్రులు.
గతంలో తనకు టికెట్ రావడానికి కారణం జూనియర్ ఎన్టీఆర్ అని కొడాలి నాని పలుమార్లు బహిరంగంగా చెప్పాడు. వీరిద్దరు జూనియర్ అనుమతి లేకుండా ఏం నిర్ణయం తీసుకోరంట..l అయితే,ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు చేసే సమయంలో వీరు జూనియర్‌కు ఈ సమాచారం ఇచ్చే ఉంటారు. అప్పుడు జూనియర్ దీనిని ఎందుకు అడ్డుకోలేదు. ఎందుకు ఏపీ ప్రభుత్వంపై బహిరంగంగా విరుచకపడలేదు. కేవలం ఒక పోస్టు పెట్టి సైలెంట్‌గా ఉంటే ఏంటి అర్థం అని తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా జూనియర్ తీరును తప్పుబడుతున్నారట..
Read Also : Shraddha Das : చీరలో కూడా ఎద ఎత్తులను చూపిస్తున్న శ్రద్దాదాస్.. ఏందీ అరాచకం..!
Read Also : Sravanthi Chokkarapu : టాప్ లెస్ లో స్రవంతి అందాల విధ్వంసం.. కొట్టుకుపోతున్న కుర్రాళ్లు..!