Aa Ammayi Gurinchi Meeku Cheppali movie review : ఎమోషనల్ కామెడీ ఎంటర్ టైనర్ సినిమాలకు పెట్టింది పేరైన మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన మూవీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఇందులో సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా నటించారు. మొదటి నుంచి విపరీతమైన ఆసక్తిని రేపింది ఈ సినిమా. ఎందుకంటే ఈ మూవీ కథకు మూలం సినిమానే కావడం. ట్రైలర్ నుంచి ప్రమోషన్ల వరకు బాగానే పబ్లిసిటీ జరుపుకున్న ఈ మూవీ నేడు థియేటర్లకు వచ్చింది. మరి ఇది ఎలా ఉందో చూద్దాం.
ఈ మూవీలో నవీన్ (సుధీర్ బాబు) ఒక కమర్షియల్ మూవీల డైరెక్టర్. వృత్తిరీత్యా కండ్ల డాక్టర్ అయిన అలేఖ్య (కృతి శెట్టి) కి చిన్నప్పటి నుంచే సినిమాలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. అయితే నవీన్ ఒక సమయంలో అలేఖ్యను చూసి తన సినిమాలో ఎలాగైనా ఆమెతో యాక్ట్ చేయించాలని అనుకుంటాడు. కానీ అలేఖ్య కుటుంబానికి సినిమాలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. మరి నవీన్ ఆమెను ఎలా ఒప్పించాడు, చివరకు ఇద్దరి నడుమ రిలేషన్ ఎలా కుదురుతుంది, అలేఖ్య కుటుంబ సభ్యులకు సినిమా ఇండస్ట్రీ అంటే ఎందుకు అంత కోపం అనేది థియేటర్లలో చూసి తెలుసుకోవాల్సిందే.
సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఒక కమర్షియల్ సినిమాలు తీసే డైరెక్టర్ పాత్రలో ఒదిగిపోయాడు. వారికి ఎలాంటి అలవాట్లు ఉంటాయో తెరపై ఆయన చక్కగా చూపించాడు. అటు ఒక డాక్టర్ పాత్రలో కృతిశెట్టి కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో ఇద్దరూ చక్కగా నటించారు. ఇందులో కృతిశెట్టి పాత్రకు ఎక్కువ స్కోప్ ఉంటుంది. అందుకే ఎమోషనల్ సీన్లు, బలమైన సన్నివేశాలు ఆమెకు ప్లస్ అయ్యాయి. ఈ కథ ఎక్కువగా వీరిద్దరి చుట్టూనే తిరుగుతుంది. మిగతా వారు వారి పాత్రల మేరకు ఆకట్టుకున్నారు.
డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ ఇలాంటి కథను ఎంచుకున్నప్పుడు కథలో ఇంకాస్త బలం ఉండేలా చూసుకోవాల్సింది. ఏదో చిన్న కారణంతో సినిమాలు వద్దనుకునే డాక్టర్‌ను సినిమాల్లో యాక్ట్ చేయించే పాయింట్ చుట్టూ మలిచేశాడు. అంతేగానీ ఎలాంటి ట్విస్టులు గానీ, అద్భుతమైన స్క్రీన్ ప్లే గానీ రాసుకోలేకపోయాడు. ఇక మ్యూజిక్ అయితే పెద్దగా ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది.
స్టోరీ నేపథ్యం
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్..
కథనంలో పట్టు లేదు
సెకండ్ హాఫ్ పేలవంగా ఉంది
చివరగా..
ఈ మూవీ మొత్తంగా చెప్పాలంటే ఒక సింపుల్ డ్రామా కథలాగా అనిపిస్తుంది. అంతే గానీ కథలో ఎక్కడా బలం ఉన్నట్టు అనిపించదు. దీన్ని రెండు భాగాలుగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు మోహనకృష్ణ. ఆ అమ్మాయి గురించి చెప్పాలని అనుకున్న డైరెక్టర్.. ఆమె గురించి స్పష్టంగా చెప్పలేకపోయాడు. ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోదు.
రేటింగ్ : 2.0/5.0
Read Also : Vishnu Priya : తన మార్ఫింగ్ వీడియోలపై ఘాటుగా స్పందించిన విష్ణుప్రియ
Read Also : Pragya Jaiswal : గోల్డెన్ కలర్ శారీలో గోల్డెన్ వలలు విసురుతున్న ప్రగ్యా జైస్వాల్