Brahmastra movie review : మొన్నటి వరకు సౌత్ సినిమాలే పాన్ ఇండియాగా వెలుగొందాయి. దాంతో మాకేం తక్కువ అన్నట్టు బాలీవుడ్ మూవీలు కూడా ఇదే బాట పట్టాయి. ఇక గత ఆరు నెలలుగా బాలీవుడ్ లో పాటు సౌత్ లో కూడా విపరీతమైన హైప్ తీసుకువచ్చిన మూవీ బ్రహ్మాస్త్ర. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీని సౌత్ లో రాజమౌళి దగ్గరుండి ప్రమోట్ చేశాడు. ఎన్టీఆర్ వచ్చి అండగా నిలిచాడు. ఇక నాగార్జున కూడా ఉండటంతో తెలుగులో బాగానే మార్కెట్ ఏర్పడింది. రణ్ బీర్ కపుర్, ఆలియా భట్ జంటగా నటించిన ఈ మూవీ నేడు థియేటర్లకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం.
ఈ కథ మొత్తం పీరియాడిక్ స్టోరీ. మూడు ముక్కలుగా ఉన్న బ్రహ్మాస్త్ర చుట్టూ ఈ కథ సాగుతుంది. ఇందులో ఒక భాగం అనీష్(నాగార్జున) దగ్గర ఉంటుంది. రెండో భాగం వచ్చేసి మోహన్ భార్గవ్(షారుఖ్ ఖాన్) అనే సైంటిస్ట్ దగ్గర ఉంటుంది. మూడు భాగాలను కలిపేసి తిరుగులేని శక్తివంతమైన బ్రహ్మాస్త్రని సొంతం చేసుకోవడానికి మౌనీ రాయ్ కి సంబంధించిన విలన్ గ్రూప్ అరాచకాలు సృష్టిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే కథలోకి వచ్చిన డీజే శివ(రణబీర్ కపూర్) కి ఈ బ్రహ్మాస్త్రకు ఏంటి సంబంధం, అసలు మూడో భాగం ఎక్కడుంది. ఈ బ్రహ్మాస్త్రను ఎవరు సాధించారన్నదే ఈ కథ.
హ్యాండ్సమ్ హీరో అయిన రణ్ బీర్ కపూర్ ఈ పీరియాడిక్ కథలో బాగానే నటించాడు. ఆలియా కూడా తన నటనతో కట్టిపడేసింది. వీరిద్దరి నడము వచ్చే రొమాంటిక్ సీన్లు బాగానే ఉన్నాయి. కాకపోతే కథ అంత బలంగా ఉన్నప్పుడు వారి పాత్రలు అంతకంటే బలంగా ఉండాల్సింది. ఏదో నార్మల్ గా ఉన్నట్టు అనిపించింది. అందుకే వారు ఎంతలా నటించినా.. పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందనే చెప్పుకోవాలి. ఇక అమితాబ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన నటన మరోసారి అద్భుతంగా ఉంది. నాగార్జున, షారుఖ్ ఖాన్ లు కూడా తమ పాత్రలతో అలరించారు. మౌనీరాయ్ విలన్ పాత్రలో బాగానే ఆకట్టుకుంది.
డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఇలాంటి సినిమాను ఎంచుకున్నప్పుడు కథలో ఇంకా బలమైన సీన్లు ఉండేలా చూసుకోవాల్సింది. పైగా అంత పెద్ద నటులను తీసుకుని వారి పాత్రల్లో బలం లేకుండా చేశాడు. పాత్రలు బలంగా ఉంటే ఈ సినిమా వేరే లెవల్ లో ఉండేదేమో. పైగా స్క్రీన్ ప్లే ఎప్పటి లాగే మూస పద్ధతిలో కొనసాగింది. అయితే వీఎఫ్‌ఎక్స్ వర్క్ మాత్రం పీక్స్ లో ఉందనే చెప్పుకోవాలి. ఆయా సీన్లకు తగ్గట్టు గ్రాఫిక్స్‌ను భలే డిజైన్ చేశాడు. ఈ విషయంలో మాత్రం డైరెక్టర్‌ను మెచ్చుకోవాల్సిందే. రాజమౌళి లాంటి డైరెక్టర్ సినిమాల్లో చూసే గ్రాఫిక్స్ ఈ సినిమాలో మనం చూడొచ్చు. సినిమాటోగ్రఫీ వర్క్ ఆకట్టుకుంటుంది. పలు సీన్లను బాగా రిచ్ గా చూపించారు. కానీ చాలా వరకు ల్యాగ్స్ ఉన్నాయి.
రణబీర్ కపూర్, ఆలియా జోడీ
వీఎఫ్‌ఎక్స్ వర్క్
పాటలు
మైనస్ పాయింట్స్..
కథ, కథనం
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
ఎడిటింగ్
ఈ సినిమా విషయంలో మూవీ టీమ్ ఇచ్చిన బిల్డప్ అంతా ఇంతా కాదు. ఈ మూవీ కోసం డైరెక్టర్ అయాన్ ముఖర్జీ పదేండ్లుగా కష్టపడుతున్నారంటూ చెప్పారు. కానీ ఆ కష్టం మాత్రం తెరపై మనకు ఎక్కడా కనిపించదు. ఈ మాత్రం చూపించడానికి అంతగా కష్టపడాల్సిన పనేంటి అన్నట్టు ఉంటుంది మూవీ. చాలా మూస కథను ఎంచుకుని ఇది వరకు చూసిన సినిమాల స్క్రీన్ ప్లేను ఈ మూవీకి మనం చూసిన ఫీలింగ్ వచ్చేలా చేశారు. భారీగా ఖర్చు చేశామని చెప్పారు. కానీ అంత అద్భుతంగా సినిమా మాత్రం లేదు. ఏమాత్రం ఎగ్జైట్ మెంట్ లేని సీన్ల కారణంగా ఈ మూవీ ఎవరినీ పెద్దగా అలరించదనే చెప్పుకోవాలి.
రేటింగ్ : 2/5
Read Also : Kiran Abbavaram : నేను మీకు బాగా కావాల్సినవాడిని ట్రైలర్ ఈరోజు పవన్ కళ్యాణ్ విడుదల చేయనున్నారు
Read Also : Samantha: వాటి వల్లేనా సమంతకు సమస్యలు?