First Day First Show Movie Review : ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ మూవీ రివ్యూ

First Day First Show Movie Review : తెలుగులో కంటెంట్ ఉండాలే గానీ చిన్న సినిమాల‌ను కూడా ప్రేక్ష‌కులు నెత్తిన పెట్టుకుంటారు. గ‌తంలో అనేక సినిమాలు ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలిచాయి. ఇక పెద్ద స్టార్ల‌తో ప్ర‌మోష‌న్ చేయించి కాస్త హంగామా చేసిన మూవీ ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో. మెగాస్టార్ ద‌గ్గ‌రుండి ప్ర‌మోట్ చేసిన ఈ మూవీలో శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు ప్రధాన పాత్రల్లో నటించారు. రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్‌గా వ‌చ్చిన ఈ మూవీ […].

By: jyothi

Updated On - Fri - 2 September 22

First Day First Show Movie Review : ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ మూవీ రివ్యూ

First Day First Show Movie Review : తెలుగులో కంటెంట్ ఉండాలే గానీ చిన్న సినిమాల‌ను కూడా ప్రేక్ష‌కులు నెత్తిన పెట్టుకుంటారు. గ‌తంలో అనేక సినిమాలు ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలిచాయి. ఇక పెద్ద స్టార్ల‌తో ప్ర‌మోష‌న్ చేయించి కాస్త హంగామా చేసిన మూవీ ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో. మెగాస్టార్ ద‌గ్గ‌రుండి ప్ర‌మోట్ చేసిన ఈ మూవీలో శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు ప్రధాన పాత్రల్లో నటించారు. రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్‌గా వ‌చ్చిన ఈ మూవీ ఈరోజు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. మ‌రి ఇది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

క‌థ ఎలా ఉందంటే..

ఈ మూవీ మొత్తం ఒక్క ఇన్సిడెంట్ చుట్టూ తిరుగుతుంది. అది కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఖుషీ చుట్టూ. ఈ మూవీ కూడా ఖుషీ మూవీ కాలం నాటిదే. శ్రీనివాస్‌(శ్రీకాంత్ రెడ్డి) మొద‌టి నుంచి ప‌వ‌ర్ స్టార్ వ‌ప‌న్ క‌ల్యాణ్‌కు వీరాభిమాని. త‌న కాలేజ్ లో చ‌దివే సంచిత (సంచిత బసు)ను ఎలాగైన ప‌డేయాల‌ని ప్లాన్ వేస్తాడు. ఇందుకోసం ఖుషీ మూవీ ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో టికెట్ల‌ను తీసుకు వ‌చ్చి ఇంప్రెస్ చేయ‌డానికి ట్రై చేస్తాడు. మ‌రి ఆయ‌న టికెట్లు తీసుకువ‌చ్చాడా, ఇంప్రెస్ చేశాడా లేదా అన్న‌ది మిగిలిన క‌థ‌.

ఎవ‌రెలా చేశారంటే..

వాస్త‌వానికి శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు ఇద్ద‌రికీ ఇది మొద‌టి సినిమా. అందుకే ఎక్స్ ప్రెష‌న్ల ప‌రంగా కొంత త‌డ‌బ‌డ్డారు. యాక్టింగ్ ప‌రంగా ప‌ర్వాలేద‌నిపించినా, కొన్ని సీన్ల‌లో ఆర్టిఫిషియ‌ల్ గా అనిపిస్తుంది. అందుకే వారు ఆ సీన్ల‌ను త‌మ ఎక్స్ ప్రెష‌న్ల‌తో పండించ‌లేక‌పోయారు. ఇక వెన్నెల కిషోర్ కామెడీ బాగానే ఉంది. తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ రెడ్డి త‌మ పాత్ర‌ల మేర‌కు ప‌ర్వాలేద‌నిపించారు. మిగిలిన న‌టీన‌టులు కూడా బాగానే చేశారు.

టెక్నిక‌ల్ గా ఎలా ఉందంటే..

డైరెక్ట‌ర్లు వంశీధ‌ర్, లక్ష్మినారాయణ పుట్టస్వామి ఈ సినిమాను ఇంకా బాగా చెక్కి ఉండాల్సింది. ఆయ‌న న‌టీన‌టుల ద‌గ్గ‌రి నుంచి మంచి ప‌ర్ఫార్మెన్స్ లాక్కోలేక‌పోయారు. సినిమాటోగ్రఫీ ప‌ర్వాలేదు. ఇక ఎడిటింగ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇక మ్యూజిక్ గురించి ఎంత త‌క్కువ‌గా చెప్పుకుంటే అంత బెట‌ర్‌. ఏ సీన్‌ను కూడా హైలెట్ చేయ‌లేక‌పోయింది. ఫ్లాట్ సన్నివేశాలు గనుక, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో బాగా హైల‌ట్ చేసి ఉంటే సినిమాకు ఇంకా ప్ల‌స్ అయ్యేది.

ప్లస్ పాయింట్స్..

పవన్ కళ్యాణ్ రిఫరెన్స్‌లు

మైనస్ పాయింట్స్..

క‌థ‌లో బ‌లం లేక‌పోవ‌డం, బ‌ల‌మైన కార‌ణాలు కూడా లేవు..
సీన్ల పరంగా సరైన ఆర్డర్ లేకపోవడం..

విశ్లేషణ..

చిన్న సినిమాల్లో కామెడీ ఎక్కువ‌గా ఉంటే బాగా వ‌ర్కౌట్ అవుతుంది. లేక‌పోతే సీరియస్ క‌థ అయినా ఉండాలి. ఈ రెండు కూడా ఈ మూవీలో లేవు. ఏదో చిన్న పాయింట్‌ను ప‌ట్టుకుని అవ‌స‌రం లేని సీన్లు రాసుకుని చేసిన‌ట్టు ఉంది మూవీ. ఒక ర‌కంగా చెప్పాలంటే మూవీ మొత్తం ఒక సాగదీత‌. చాలావరకు సినిమా పెద్ద‌గా మెప్పించ‌దు. జాతి రత్నాలు లాంటి అమేజింగ్ క‌థను తీస‌ని అనుదీప్ ఈసారి త‌న పెన్నుకు స‌రైన ప‌ని చెప్ప‌లేదు. ఈ సినిమా మొత్తంగా బోర్ కొట్టిస్తుంది.

రేటింగ్‌
1.5/5

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News