Godfather movie Review : గాడ్ ఫాదర్ మూవీ దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవి ఇందులో హీరోగా నటిస్తున్నారు. ఆచార్య మూవీ డిజాస్టర్ కావడంతో ఎలాగైనా ఈసారి హిట్ కొట్టాలని చిరు ఆశగా ఉన్నారట.. అక్టోబర్ 5న ఈ సినిమా థియేటర్ల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ అందరినోట పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీనికి సెన్సార్ బోర్డు కూడా యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఫ్యామిలీ అంతా కలిసి ఈ సినిమా చూడొచ్చు.
గాడ్ ఫాదర్ మూవీ మళయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ మూవీకి తెలుగు రీమెక్. ఈ సినిమాను ముందుగా పవన్ కళ్యాణ్‌తో చేయించాలని దర్శకనిర్మాతలు భావించారట..చివరకు ఇది చిరువద్దకు వచ్చి ఆగింది. తనయుడు రాంచరణ్ సలహా మేరకు చిరు ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పారట.. ఇక స్టోరీ విషయానికొస్తే పొలిటికల్ యాక్షన్ డ్రామాగా సినిమా తెరకెక్కింది. ఈమూవీని చిరు భార్య సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై ఆర్ బి. చౌదరి, ఎన్వీప్రసాద్ నిర్మించగా.. మోహన్ రాజా దర్శకత్వం వహించాడు.
ఇక కాస్టింగ్ విషయానికొస్తే ఇందులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, సముద్రఖని, సునీల్, నయనతార, సత్యదేవ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో సత్యదేవ్ విలన్ రోల్ చేస్తుండగా.. నయన్ చిరుకు చెల్లెలిగా చేస్తోంది. ఈసినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పొలిటికల్ పరంగా తన కుటుంబంలో ఎదురయ్యే సవాళ్లను చిరు ఎలా అధిగమించాడనేది స్టోరీ.. దీనిపై అటు చిరు, ఇటు ఫ్యాన్స్ చాలా ఆశగా ఉన్నారు. మరికొన్ని గంటల్లో సినిమా ఎలా ఉండబోతుందో బహిర్గతం కానుంది.
Read Also : Raasi: ఆ సీన్ లో మోహన్ బాబు ముందు నగ్నంగా నటించిన రాశి.. బట్టలు విప్పేసి..
Read Also : Krishna: కూతురు మంజులను టార్చర్ పెట్టిన కృష్ణ.. అతనితో ప్రేమే కారణమా..?