Krishna Vrinda Vihari movie review : ఇవాళ నాగశౌర్య హీరోగా చేసిన ‘కృష్ణవ్రింద విహారి’ సినిమా థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. చాలాకాలంగా ప్లాఫులను ఎదుర్కొంటూ వస్తున్న నాగశౌర్య ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. అందుకే ఈ సినిమా విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు, పైగా ప్రమోషన్లలో ఎంతో చురుకుగా పాల్గొన్నాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా అనే విషయాలను రివ్యూలో భాగంగా తెలుసుకుందాం.
కట్టుబాట్లకు కేరాఫ్ గా నిలిచే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కుర్రాడు కృష్ణ (నాగశౌర్య) కు పని చేసే ఆఫీస్ లో ఉండే నార్త్ అమ్మాయి అయిన వ్రింద (షిర్లీ సెటియా)తో ప్రేమ పుడుతుంది. వ్రిందను తన ప్రేమలో దింపడానికి కృష్ణ కష్టడతాడు. వీరిద్దరికి పెళ్లి కూడా అవుతుంది. రెండు వేర్వేరు లైఫ్ స్టైల్స్ కలిసిన వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు.. వీరి పెళ్లి విషయంలో ఎలా స్పందిస్తారు, వాళ్లు ఎలాంటి ఛాలెంజ్ లను ఎదుర్కొన్నారనేదే ఈ సినిమాలోని కథ.
బ్రాహ్మణ కుటుంబంలో పెరిగిన పద్ధతైన కుర్రాడిగా నాగశౌర్య మెప్పించాడు. నాగశౌర్య ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాడనే విషయం అతడి యాక్టింగ్ చూసిన అందరికీ తెలిసిపోతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా, విభిన్నమైన లుక్ లో అలరించాడు. ఇక హీరోయిన్ గా షిర్లీ సెటియాకు సినిమాలో నటన గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీలేదు. అయితే లుక్స్ పరంగా షిర్లీ ప్రేక్షకులకు ఫ్రెష్ గా అనిపిస్తుంది. సినిమాలోని ఇతరులు వారివారి పాత్రలతో నటించి మెప్పించారు.
సినిమాకు బలం కథే. కానీ దర్శకుడు ఈ కథను మరింత బలంగా రాసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే విషయంలో డైరెక్టర్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడనే చెప్పుకోవాలి. చాలా చోట్ల లాజిక్ లేని సీన్లు రాగా, కొన్నిచోట్ల ఎమోషనల్ సీన్లు ఆకట్టుకోలేకపోయాయి. ఇలాంటి సీన్ల విషయంలో డైరెక్టర్ సినిమాకు వచ్చిన ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టినట్లు అనిపించింది. ఇక మ్యూజిక్ మామూలుగానే అనిపించింది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గురించి కూడా ప్రస్తావించేంత అద్భుతంగా లేదు. ఎడిటింగ్ లో కూడా లోపాలున్నాయి. నిర్మాణాత్మక విలువలు బాగానే ఉన్నా సినిమాలో పసలేదనిపించింది.
సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు
కామెడీ ట్రాక్
నాగ శౌర్య యాక్టింగ్
మైనస్ పాయింట్స్ :
కథ మరియు కథనం
ఎడిటింగ్
కథలో బలమైన పాత్రలు లేకపోవడం
నాగశౌర్య హిట్ చూసి చాలా కాలమే అయింది. కనీసం ఈ సినిమాతో అయినా అతడి కోరిక తీరుతుందని అందరూ అనుకున్నా.. అది నిరుత్సాహాన్ని మిగిల్చిందని చెప్పుకోవాలి. సినిమాలో నాగశౌర్య యాక్టింగ్ బాగా ఉన్నా, కథ ఆసక్తికరంగా లేకుండా, ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ లేకుండా సక్సెస్ అనేది సాధ్యం కాదు. ఈ సినిమాకు ప్రస్తుతం పెద్దగా పోటీ లేకపోయినా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడం అనుమానంగానే కనిపిస్తోంది. అందుకే కలెక్షన్లు కూడా భారీగా ఉండకపోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే కాస్త ఓపిక ఉండే వెళ్లండి
రేటింగ్ : 2.0/5.0
Read alaso : 5G Mobiles : 10వేల లోపే బోలెడన్ని 5జీ మొబైల్స్.. ఆఫర్స్ అదుర్స్!
Read Also : Sri Satya Boy friend Pavan : శ్రీ సత్య అలాంటిదే.. అందుకే పెళ్లి చేసుకోలేదు.. బాయ్‌ఫ్రెండ్ సంచలన కామెంట్స్