Oke Oka Jeevitham Movie Review : ఒకే ఒక జీవితం మూవీ రివ్యూ..

Oke Oka Jeevitham Movie Review : టాలీవుడ్ లో మోస్ట్ ట్యాలెంటెడ్ హీరో అనిపించుకున్నాడు శ‌ర్వానంద్‌. ఆయ‌న తీసే సినిమాల్లో చాలా వ‌ర‌కు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ల‌వ్ స్టోరీలు ఎంత డిఫ‌రెంట్ గా ఉంటాయో.. మిగ‌తా సినిమాలు కూడా అంత‌కంటే ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. తాజాగా మ‌రోసారి అలాంటి డిఫ‌రెంట్ క‌థ అయిన ఒకే ఒక జీవితం అనే టైమ్ ట్రావెల‌ర్ స్టోరీతో మ‌న ముందుకు వ‌చ్చాడు. సీనియ‌ర్ హీరోయిన్ అమ‌ల న‌టించిన […].

By: jyothi

Updated On - Fri - 9 September 22

Oke Oka Jeevitham Movie Review : ఒకే ఒక జీవితం మూవీ రివ్యూ..

Oke Oka Jeevitham Movie Review : టాలీవుడ్ లో మోస్ట్ ట్యాలెంటెడ్ హీరో అనిపించుకున్నాడు శ‌ర్వానంద్‌. ఆయ‌న తీసే సినిమాల్లో చాలా వ‌ర‌కు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ల‌వ్ స్టోరీలు ఎంత డిఫ‌రెంట్ గా ఉంటాయో.. మిగ‌తా సినిమాలు కూడా అంత‌కంటే ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. తాజాగా మ‌రోసారి అలాంటి డిఫ‌రెంట్ క‌థ అయిన ఒకే ఒక జీవితం అనే టైమ్ ట్రావెల‌ర్ స్టోరీతో మ‌న ముందుకు వ‌చ్చాడు. సీనియ‌ర్ హీరోయిన్ అమ‌ల న‌టించిన ఈ మూవీ ఆయ‌న‌కు హిట్ ఇచ్చిందా లేదా అన్న‌ది చూద్దాం.

కథ ఎలా ఉందంటే..

ఇది ఒక పూర్తి స్థాయి టైమ్ ట్రావెల్ క‌థ‌. ఆది, చైతన్య, శ్రీనులు చిన్న‌ప్ప‌టి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్‌. కాక‌పోతే ముగ్గురూ చిన్న‌ప్ప‌టి నుంచి ఎన్నో క‌ష్టాల‌ను అనుభ‌వించిపెరుగుతారు. జీవితంపై ఒకింత విర‌క్తి పుడుతున్న స‌మ‌యంలో వారికి సైంటిస్ట్ పాల్ క‌లుస్తారు. ఆయ‌న ఓ టైమ్ ట్రావెల్ పై ప‌నిచేస్తున్నారు. వీరు త‌మ క‌ష్టాల‌ను చెప్పుకోగానే.. ఆయ‌న మీరు టైమ్ ట్రావెల్ చేసి మీ క‌ల‌ల‌ను నెర‌వేర్చుకోండి అంటూ స‌ల‌హా ఇస్తారు. వారు వెంట‌నే ఓకే అని అలాగే చేస్తారు. త‌మ చిన్న‌ప్ప‌టి కాలానికి వెళ్లిపోతారు. ఆ స‌మ‌యంలో ఏం జ‌రిగిందో.. పెద్ద‌య్యాక‌, చిన్న‌ప్ప‌టి విష‌యాల‌ను స్క్రీన్ పై చూడాల్సిందే.

ఎవ‌రెలా చేశారంటే..

శ‌ర్వానంద్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న ఎలాంటి పాత్ర‌కు అయినా ప్రాణం పోసేస్తాడు. ఇప్పుడు మ‌రోసారి ఈ క‌థ విష‌యంలో అలాంటిదే జ‌రిగింది. ఈ మూవీ సెకండ్ హాఫ్ లో ఆయ‌న పండించిన ఎమోష‌న‌ల్ సీన్లు క‌ట్టిప‌డేస్తాయి. ఒక మ‌నిషి జీవితంలో ఏది ఉండాలో క‌రెక్టుగా అర్థ‌మ‌య్యేలా వివ‌రించాడు. ఇక శ‌ర్వానంద్ త‌ల్లి పాత్ర‌లో అక్కినేని అమల అద్భుతంగా న‌టించి మెప్పించింది. అప్ప‌ట్లో లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ త‌ర్వాత మ‌ళ్లీ అలాంటి పాత్ర‌లోనే మెరిసింది. మిగ‌తా న‌టీన‌టులు వారి పాత్ర‌ల మేర‌కు బాగానే న‌టించారు.

వెన్నెల, ప్రియ‌ద‌ర్శి కామెడీ బాగుంది. హీరో శ‌ర్వానంద్‌కు మంచి స‌పోర్టింగ్ పాత్ర‌ల్లో వారు న‌టించి మెప్పించార‌నే చెప్పుకోవాలి. ముగ్గురు ప్రాణ స్నేహితుల్లాగా వారిని మ‌నం తెర‌పై చూడొచ్చు. రీతూ వర్మ పాత్ర స్క్రీన్ టైమ్ తక్కువగా ఉంది. కానీ ఉన్న కాసేపే త‌న గ్లామ‌ర్ తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నాలు చేసింది.

టెక్నిక‌ల్ గా ఎలా ఉందంటే..

ఈ సినిమా విష‌యంలో ముఖ్యంగా డైరెక్ట‌ర్ శ్రీ కార్తీక్ సాహ‌సాన్ని మెచ్చుకోవాలి. ఇలాంటి క‌థ‌లు మ‌న ప్రేక్ష‌కుల‌కు ఎక్కుతాయా అనే అనుమానాలు లేకుండా అద్భుతంగా చూపించాడు. సీన్ల‌కు త‌గ్గ‌ట్టు అదిరిపోయే డైలాగుల‌తో కట్టి పడేశాడు. తాను ఏదైనా చూపించాల‌ని అనుకున్నాడో దాన్ని ఏ మాత్రం త‌డ‌బ‌డ‌కుండా చూపించాడు. సినిమాటోగ్రఫీ వర్క్‌ కూడా బాగుంది. టైమ్ ట్రావెల్ లాంటి క‌థ‌ను ఎంచుకుని ఎమోష‌న‌ల్ సీన్ల‌తో అన్నీ మరిచిపోయేలా చేశాడు. ఇక మ్యూజిక్ డైరెక్ట‌ర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సీన్ల‌కు ప్రాణం పోశాడు. ఈ సినిమాలో అన్నింటికంటే ఎక్కువ ఆక‌ట్టుకున్నవి మాత్రం డైలాగ్స్ అనే చెప్పుకోవాలి.

ప్లస్ పాయింట్స్..
బ‌ల‌మైన కథ
దర్శకత్వం, స్క్రీన్ ప్లే
ఎమోషనల్ సీన్లు

మైనస్ పాయింట్స్..

కొన్ని సీన్లు సాగతీసినట్లుగా ఉండ‌టం
అక్కడక్కడా నాచురాలిటీ త‌గ్గింది

చివ‌ర‌గా..

ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నం తెర‌పై టైమ్ ట్రావెల్ క‌థ‌లు బాగానే చూశాం. కానీ అవ‌న్నింటికంటే ఇది ఒక ఎమోష‌న‌ల్ తో కూడిన స్టోరీ. ఏదో సాధించాల‌నే త‌ప‌న‌ను ప‌క్క‌న పెట్టి.. మ‌నిషి జీవితంలో జ‌రిగే భావోద్వేగాల చుట్టూ ఈ క‌థ‌ను తిప్పేశాడు డైరెక్ట‌ర్‌. అదే ఈ సినిమాకు అతిపెద్ద బ‌లం అయిపోయింది. ఇక హీరోగా శర్వానంద్ కి చాలా కాలం తర్వాత హిట్ ప‌డింద‌నే చెప్పుకోవాలి. ఆయ‌న న‌ట విశ్వ‌రూపాన్ని ఈ సినిమాలో మ‌నం చూడొచ్చు. ఇక అమ‌ల‌కు ఈ సినిమాతో మంచి పేరు వ‌స్తుంద‌న‌డంలో సందేహం లేదు. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఈ మూవీ మంచి వ‌సూళ్లు రాబ‌ట్టే ఛాన్స్ ఉంది.

రేటింగ్‌ : 3/5

Tags

Related News